ప్రత్యేకం: నేడు ప్రణబ్ ముఖర్జీ ఆరెసెస్ సమావేశానికి హాజరవుతున్న సంధర్భంగా.....

https://www.apherald.com/Politics/ViewArticle/308892/national-news-pranab-daa-must-visit-rss-tranining-/

(పై లింక్ తరువాయి భాగం)


విదేశీ, రక్షణ, ఆర్థిక తదితర కీలకమైన మంత్రిత్వశాఖలనన్నిన్టినీ ఆయన నిర్వహించారు. పార్టీ అధ్యక్ష పదవి మినహా కాంగ్రెసు వర్కింగు కమిటీతో సహా దాదాపు అన్ని పార్టీ పదవులు నిర్వహించారు. ‘మేన్ ఆఫ్ ఆల్ సీజన్స్’ అంటే రాజకీయ ఏ సమస్యాత్మక సందర్భంలోనైనా సమయోచితంగా నిర్వహించి విజయం సాధించగల వ్యక్తిగా పేరుపొందిన ప్రణబ్ పార్టీ ట్రబు షూటర్ అంటే సంక్షోభాల పరిష్కర్త. 

 


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణం తో సహా అనేక రాజకీయ ప్రభుత్వ కమిటీలకే కాకుండా దాదాపు అన్ని ‘గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ’ ల్లోనూ ఆయన ప్రాతినిధ్యం కొన సాగింది. చాలా కమిటీలకు ఆయనే అధ్యక్షుడు. ముందు వెనుకలు ఆలోచించకుండా నిర్ణయాలు తీసేసుకునేంత అపరిపక్వ రాజకీయవేత్త కాదు. అందుకే “ఆర్ఎస్ఎస్” ఆహ్వానాన్ని మన్నించడంలో ఆయన వ్యూహాలు రాజకీయ నైపుణ్యం ఆయనకున్నాయి.

 

రాజకీయంగా ‘ఆర్ఎస్ఎస్’ సిద్ధాంతాలను కోట్లమంది వ్యతిరేకించవచ్చు. కానీ అంతకు రెట్టింపు అభిమానులున్నారు. పార్టీలు విభేదించవచ్చు. కానీ అది పక్కా రాజకీయమే. మనం అవునన్నా, వేరొకరు కాదన్నా ‘ఆర్ఎస్ఎస్’ భారత జన జీవన స్రవంతిలో అతి ముఖ్యమైన అంతర్బాగం. 

 


31వేల ప్రాంతాల్లో 54వేల శాఖలతో విస్తరించిన ఒక సైద్దాంతిక మహావృక్షం.  ఏబీవీపీ, వీహెచ్పీ, బీఎంఎస్ వంటి 90కి పైగా అనుబంధ సంఘాలతో లక్షా 70వేలకు పైగా సాంఘిక, విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఒక భావ ప్రవాహం. దేశాన్నేలుతున్న ప్రధాని మోడీ సహా మూడింట రెండు వంతుల మంది కేంద్ర మంత్రులు ఈ నేపధ్యం నుంచి వచ్చినవారే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు అందరూ ఈ మూలాల నుంచి ఎదిగినవారే. 

 

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పూర్వాశ్రమంలో ‘ఆర్ఎస్ఎస్’ అనుబంధం ఉన్నవారే. మరి ఆ సంస్థతో పాటు వీరందరినీ కూడా దూరం పెడదామా? లక్షల్లో ప్రచారకులు, కోట్లమంది అభిమానులతో ఉన్న ఆర్ఎస్ఎస్ మూలాలు తొలగించ సాధ్యమా?  దాని మూల మూలలా విస్తరించిన మూలాలే దేశం లో  వరదలు, ప్రకృతి విపత్తులు, యుద్ద సమయాల్లో కఠోర సైనిక క్రమ లాంటి శిక్షణతో నైపుణ్యం కొరతలేని ఈ సంస్థ వాలంటీర్లు రంగంలోకి దిగుతారు. మతపరమైన, సైద్ధాంతిక భావజాలాల్లో వైరుద్ధ్యాల తో ఇతర పార్టీలు ‘ఆర్ఎస్ఎస్’ ను వ్యతిరేకించవచ్చు. అది ప్రజాస్వామ్యయుతంగా ఆయా పార్టీలకు ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛ.  కానీ మనకున్న భావ స్వాతంత్రంతో లభించిన స్వేచ్చను ద్వేషంగా రూపాంతరం చెందటమ్ను ఆపకుంటే దేశంలోని దాదాపు సగం పైగా ప్రజలకు దూరం కావడమే. ఆఅ మూర్ఖత్వం ప్రదర్శించేటప్పుడు విచక్షణను కోల్పోతే దేశం విలువైన సమయాన్నివ్యర్ధం చేయడమే. “భిన్నత్వంలో ఏకత్వం” అని ప్రవచించే రాజకీయ పార్టీలు ఈ నిజాన్ని ఆర్ఎస్ఎస్ విషయంలో గుర్తించ నిరాకరించడంతోనే ఆ ఆర్ఎస్ఎస్ సైద్దాంతిక భావజాలం దేశంలో మరింతగా వేగంగా వ్యాపిస్తోంది. అణచేస్తే అంతకు వెయ్యి రెట్లు వృద్ది చెందే దాన్నే భావ జాలం అంటారు. 

 

భారత ప్రజాస్వామ్యంలో రాజకీయ అంటరానితనము ఉండదు ఉండకూడదు - అందర్నీ కలుపుకుని పోవడమే అసలైన రాజనీతి. విభేదించే విధానాలతో రాజకీయంగా పోరాటం చేయడమెంత ముఖ్యమో, సామాజికంగా వారితో కలిసి నడవడమూ అంతే ముఖ్యం. ప్రజాస్వామ్యంలో సామాజిక అంతరం ఉండకూడదు. ఏకపక్ష ఆలోచనలతో ఉన్నవారిని సైతం సరిదిద్ది సర్దుబాటు చేయడం సామాజిక రాజకీయ వేత్తలకు లక్ష్యం కావాలి. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ, ఇందిరాగాంధీ వంటివారు సైతం ఇదే ఆలోచనతో “ఆర్ఎస్ఎస్” సమావేశాలకు హాజరయ్యారు. తనకున్న పరపతిని, సామాజిక అవసరాన్ని వినియోగించి ఏదో చెప్పాల్సిన అవసరముందన్న ఉద్దేశంతోనే ప్రణబ్ దా నాగపూర్ ఆహ్వానాన్ని మన్నించి ఉంటారు. అది ఆయన రాజకీయ పరిపక్వత. 

 

సోనియా గాంధీకి మెలకువతో రాజకీయ నడక నేర్పడమే కాదు, ఇందిర వంటి ఉక్కు ప్రధానికి సలహాలిచ్చిన ప్రణబ్ నిర్ణయాన్నే ప్రశ్నించడం అవివేకం. అంతటి అనుభవజ్ణునికి ఇంతగా తనపై విమర్శలు వస్తాయని తెలియదనుకోలేం. ఏదో ఉన్మాదంతో ప్రకటనలు చేసి రచ్చ చేయడం కంటే ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఆఅరోగ్యవంతమైన రాజకీయాలకు అవకాశం సతతహరితంగా ఉంచటం మనకు మదేశానికి చాలా ముఖ్యం. రాజనీతిని మరిచిపోయి రణనీతి ప్రవాహంలో కొట్టుకుపోతే ప్రయోజనం పొందేది ప్రత్యర్ధే. ఈ పతనం స్వయం కృతాపరాధం అవుతుంది. రానున్న రోజుల్లో కేంద్ర రాజకీయాల్లో సరికొత్త శకం మొదలు కానుందా? మాజీ రాష్ట్రపతి ప్రధాని అయ్యే అవకాశం ఉందా? విశ్వసనీయ రాజకీయ వర్గాలు ఇది అసాధ్యం కాదని అంటున్నాయి. 

 

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ 2019ఎన్నికలకు కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రధానిగా రంగంలోకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అవి సూచిస్తున్నాయి. అది ప్రత్యామ్నాయ వ్యూహాల మీద సీరియ్‌సగా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. గతకొద్ది రోజులుగా తెరవెనుక జరుగుతున్న రాజకీయ పరిణామాలు. ఈమేరకు కీలక సంకేతాల ను వెలువరిస్తున్నాయి. ఇందులో భాగం గా ఏర్పాటయ్యే ఫెడరల్ ఫ్రంట్‌ లేదా మరేదైనా దాని నేపధ్యంలో ఉనికి చాటుతున్న రహస్య రాజకీయ సమ్మోహనాస్త్రమే ప్రణబ్‌ ముఖర్జీ అని ఎన్డీటీవీ వర్గాలు విశ్లేషించాయి.  

కాగాఫెడరల్‌ ఫ్రంట్‌ పేరిట తెలంగాణ సీఎం కేసీఆర్‌ తో ఇటీవల మమతా బెనర్జీ భేటీ అయిన విషయం తెలిసిందే. వారి వెనక సూత్రధారి ప్రణబ్‌ అని బీజేపీ సీనియర్‌ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. మమత డీదీ ఏం చేసినా అది ప్రణబ్‌ దా కనుసన్న ల్లో నుండేనని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే ఐదేళ్ల పాటు భారతదేశ భవిష్యత్తు ను నిర్దేశించే ఫ్రంట్‌కు వీరు రూపకల్పన చేయాలని అనుకుంటున్నారని తెలిపారు. వచ్చే నెల్లో జరిగే ఆరెస్సెస్‌ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ప్రణబ్‌ ముఖర్జీ అంగీకరించడం ముదావహం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: