"ఆపరేషన్ గరుడ" పై సీబీఐ మాజీ జెడీ లక్ష్మినారాయణ స్పందన

సినీనటుడు శొంఠినేని శివాజి ఆపరేషన్ గరుడ అంటూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన కలకలం అంతాయింతా కాదు. చివరకు ఆ ఎపిసోడ్ మొత్తానికి కథ చిత్రాను వాదం దర్శకత్వం నిర్మాట చంద్రబాబేనని వార్తలొచ్చాయి. అయితే ఆపరేషన్ గరుడ విషయమై విలేఖరులు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జెడి) లక్ష్మీనారాయణను ప్రశ్నించగా ఆయన స్పందించారు. 

తనకు "ఆపరేషన్ గరుడ" గురించి ఏమాత్రమూ తెలియదని, మజీ రాష్ట్రపతి దివంగత ఏపిజె అబ్దుల్ కలామ్ చెప్పిన "గరుడ" గురించి మాత్రమే తెలుసునని ఆయన అన్నారు. అబ్దుల్ కలామ్ చెప్పినట్టు "గరుడ పక్షి లాంటి దృక్పథం అలవరుచుకోవాలని, అదే తనకు తెలుసునని అన్నారు. విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన బిజెపితో తనకు సంబంధాలు ఉన్నాయని అంటూ వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. 


బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏ సందర్భంలో? ఎలా మాట్లాడారో? తనకు తెలియదని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై చేసిన వ్యాఖ్యలపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. తాను ఎవరితోను సంప్రదింపుల్లో లేనని, రైతులు, కళాకారులు, విద్యార్థులతో మాత్రమే చర్చల్లో ఉన్నానని చెప్పారు. 

సామాజికవర్గం గురించి ఎప్పుడూ ఆలోచించనని, ఇంటి గడప దాటగానే సమాజమే తన సామాజికవర్గమని ఆయన అన్నారు. ఇంటి బయటకు వచ్చిన తర్వాత సామాజిక వర్గం గుఱించి ఆలోచించనని "ప్రజలను విభజించాలని" అనుకునే వారు ఈ విషయం నేర్చుకోవాలని సలహాఇచ్చారు.  తాను ఏ పని చేసినా మనసుపెట్టి, శ్రద్దతో, నిబద్ధత తో చేస్తానని, "పాపులారిటీ అనేది తనకు సైడ్ ఎఫెక్ట్‌" లాంటిదని అన్నారు. దానికోసం తానెప్పుడూ పని చేయనని స్పష్టం చేశారు. తను పాపులారిటీ కోసం చేస్తున్నాననే విమర్శలు వారిలో వెల్లువెత్తుతున్న భయం నుంచి వచ్చినవై ఉండవచ్చునన్నారు.


చివరికి జెడి లక్ష్మినారాయాణ పై కూడా ఆలోచించకుడా అధికారపార్టీ బురద చల్లేస్తుందన్నమాట. ఏవరైనా రాజకీయంగా తమకేమైనా అడ్డువస్తారేమోనని పించినా కొంత బురద పేడ వారీపి చల్లేస్తే చాలౌ అనే అద్భుత సిద్ధాంతం అలవరచుకొని సమాజానికి అలవాటు చేసేస్తుందంటున్నారు అక్కడ జనం అధికార పార్టీని ఉద్దేశిస్తూ!  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: