కాంగ్రెస్ తో దొరికిన లోకేష్, బాబు ఫైర్ ??

KSK
వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగు ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అప్పుడే పొత్తులకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తన రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీతో జత కలవడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ కలయిక కోసం ఇప్ప‌టికే తొలి ద‌ఫా రౌండ్ చ‌ర్చ‌లు సాగాయ‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల అమెరిక ప‌ర్య‌ట‌న‌లో నారా లోకేష్ కొంద‌రు కాంగ్రెస్ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు.


రెండు పార్టీల మ‌ధ్య పొత్తు ఉంటే ఎలా ఉంటుంది అనే దానిపై స్తూలంగా చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ విష‌యాన్ని ఓ సీనియ‌ర్ కాంగ్రెస్ నేత ఇటీవ‌ల చెప్పిన‌ట్లు స‌మాచారం. లోకేష్‌తో చ‌ర్చ‌లు జ‌రిగిన మాట నిజ‌మ‌ని అయ‌న చెప్పారు. అయితే పొత్తు విషయంలో సరైన లోటుపాట్లు ఉన్నాయని అవి ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి కనుక పొత్తు పొడుస్తుందా లేదా అనే విష‌యాన్ని ఇప్పుడే చెప్పలేమని అన్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈ కాంగ్రెస్ సీనియర్ నేత.


అయితే తాజాగా ఈ పొత్తు విషయం రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకులు తేలియడంతో రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీతో కూడా క లవడానికి చంద్రబాబు సిద్ధపడ్డారని విమర్శలు చేస్తూ అసహ్యించుకుంటున్నారు..ఏ పార్టీకి అయితే వ్యతిరేకంగా నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారో...ఆ పార్టీతో తన రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు చేతులు కలపడాని తప్పుపట్టారు.


అంతేకాకుండా మంత్రి లోకేష్ స్వయానా కాంగ్రెస్ తో చేతులు కలపడానికి ప్రయత్నించడంతో మంత్రి లోకేష్ పై కూడా వైసిపి నాయకులు మండిపడుతున్నారు. అయితే ఈ మొత్తం విషయం బయటకు రావడంతో చంద్రబాబు తన కుమారుడు లోకేష్ పై మంచిపడినట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: