జగన్ మీద మీడియా కక్ష... ప్రజల్లో అసహ్యం...!

Prathap Kaluva

జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ప్రతి పక్ష నాయకుడు. అయితే జగన్ మీద టీడీపీ వారు అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలు చేసిన అందులో ఆశ్చర్యం లేదు. కానీ అధికార పార్టీ కి తొత్తుగా మారిన కొన్ని పార్టీలు మరీ భరి తెగించి తెలుగు దేశం మాదిరిగా పనికమాలిన విమర్శలు చేస్తూ వార్తలను ప్రసారం చేస్తుంది. అయితే మీడియా పాటించవలిసిన కనీస విలువలను కూడా తుంగ లో తొక్కి మీడియా కు ఉన్న పవర్ ను మిస్ యూస్ చేస్తున్నాయి. 


రమణ దీక్షితులు వెళ్లి జగన్ ను కలిసారు. రమణ దీక్షితులు ఎవరు? తెలగుదేశం ప్రభుత్వంతో గొడవపడుతున్న వ్యక్తి. ఆయన మాట ప్రకారం ఓ బాధితుడు. జగన్ ఎవరు? ఓ ప్రతిపక్ష నాయకుడు. మరి వెళ్లి కలిసి తన బాధ చెప్పుకుంటే తప్పేమిటి? సరే జగన్ తన కంపెనీలోంచి కొందరు ఉద్యోగులను తొలగించారు. వాళ్లు వెళ్లి చంద్రబాబును కలిసారు. అనుకుందాం. అప్పుడు అది తప్పు అవుతుందా?


ఇంకొంతమంది ముందుకు వెళ్లి 'దేవుడి బిడ్డ జగన్' ను పూజారి రమణ దీక్షితులు కలవడం ఏమిటి? అని సెటైర్లు వేస్తున్నారు. అంటే క్రిస్టియన్ పాస్టర్లు ఎవరికైనా సమస్య వస్తే, హిందువు అయిన చంద్రబాబును కలవకూడదా? ఇలాంటి వాదన జర్నలిస్టులు చేయడం చూస్తుంటే, తెలుగుదేశం పార్టీ మాత్రమే కాకుండా, ఓ వర్గానికి చెందిన మీడియా, జర్నలిస్టులు కూడా జగన్ ను ఓ అంటరాని నాయకుడిగా చూస్తున్నట్లు కనిపిస్తోంది. వీరికి జగన్ కూర్చున్నా తప్పే, నిల్చున్నా తప్పే, పడుకున్నా తప్పే, ఏం చేసినా తప్పే. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: