పవన్ ఆవేదన పై సెటైర్లు !

Seetha Sailaja
పవన్ గత కొన్ని రోజులుగా కొనసాగిస్తున్న ‘పోరాట యాత్ర’ లో ఒకరోజు చెప్పిన మాటలను మరో రోజు చెప్పకుండా రోజుకు ఒక ట్విస్ట్ ఇస్తూ పవన్ చేస్తున్న ఉపన్యాసాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు పవన్ ఉద్దేశ్యాలలోనే కాదు పవన్ ఆవేదనలో కూడ క్లారిటీ లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. నిన్న గురువారం నాడు విశాఖపట్నం జిల్లా పాడేరులో పవన్ మాట్లాడుతూ తాను కుల రాజకీయాలు చేయడం లేదని కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు కుల రాజకీయాలు చేసే రాజకీయ పార్టీల పై తాను పోరాటం చేస్తాను అంటూ పిలుపు కూడ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈవిషయమై కొందరు చర్చలు చేస్తున్నారు. ‘జనసేన’ పార్టీ పదవులలో 90 శాతం మంది కాపు సామాజిక వర్గ వ్యక్తులే ఉన్న విషయం పవన్ కు తెలియదా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. దీనికితోడు పవన్ తన రూట్ మార్చి తాను రాజకీయంగా చాల బలం పుంజుకున్న శక్తిని అని తనకు తానే ప్రకటించుకుంటున్నాడు. 

ఇది ఇలా ఉండగా పవన్‌ ఒకప్పటి ప్రసంగాలకు పోరాటయాత్రలో చేస్తున్న ప్రసంగాలకు తేడా కనబడుతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ ఇదే దూకుడు ముందు నుంచి చూపించి ఉంటే ‘జనసేన’ ఇప్పటికే జనంలోకి వెళ్ళగలిగి ఉండేది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  తనకు  తానే శక్తిమంతుడిగా ఎక్స్‌పోజ్‌ చేసుకోవడానికి పవన్ ప్రయత్నాలు బాగానే ఉన్నా  తన జనసేనలోని ప్రతి కార్యకర్త అయిదొందల ఓట్లు వేయిస్తే తాను ముఖ్యమంత్రిని అవుతాను అంటూ తన అభిమానులకు టార్గెట్ ఇస్తున్న నేపధ్యంలో ఇలాంటి టార్గెట్స్ రాజకీయాలలో వర్కౌట్ అవుతాయా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

దీనితోడు రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉంది అంటూ పవన్ హెచ్చరికలు ఇస్తున్న నేపధ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలుగా విడిపోవడంతో ఇంకా ఎన్ని ముక్కలుగా తెలుగువారు విడిపోతారు అంటూ పవన్ అభిప్రాయాలను విమర్శకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏమైనా పవన్ మాటలలో వేడి పెరిగింది కాని క్లారిటీ అనేది రోజురోజుకు తగ్గిపోతోంది అన్న కామెంట్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: