నిరుపేదలతో నిండిన ప్రపంచ సంపన్న దేశం భారత్

భారతీయ సంపన్నులు ఏ యేటి కాయేడు మరింత సంపన్నులు అవుతున్నారు. అంటే పెరుగుతున్న ఆర్ధిక అభివృద్ది ప్రతి భారతీయుణ్ణి చేరట్లేదు. మరైతే దినదిన ప్రవర్ధ మానం అవుతున్న భారత సంపద ఎక్కడికెళుతుందీ?  సృష్టి అవుతున్న సంపద దాని పంపిణీకి పొంతనేలేదు.   




60శాతం భారత సంపద శాతం భారత జనాబా చేతుల్లొనే ఉంది. ఈ శాతం 2015 లో 53 శాతంగా ఉండగా – ఇప్పుడు అది 2016 లో 58.40శాతంగా మారింది. ఇది ఎవడో అనామతుగాడో, ఆషామాషిగాడో, చెప్పిన మాటకాదు. క్రెడిట్ సూసీ రిసెర్చ్ 
ఇనిస్టిట్యూట్ 
2016 

లో ప్రచురించిన '

గ్లోబల్ హెల్త్ రిపొర్టు' నివేదిక నుండి సేకరించబడింది. 






BRICS (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా & సౌత్ ఆఫ్రికా)  దేశాల బృందంలో మిగిలిన దేశాల కంటే రష్యా సంపద నియంత్రణ చాలా బాగుందట. 

“దేశంలో సంపద అంతకంతకు పెరుగుతూ అభివృద్ది చెందుతూ వస్తున్న – ఆ అభివృద్దిలో తనకు రావలసిన వాటాను ప్రతి భారతీయుడు పొందట్లేక పోతున్నాడు” అని అదే నివేదిక ప్రచురించింది. 96 శాతం వయోజనులు $10000/- (అంటే ₹685000/-)  లోపలే సంపద కలిగి ఉన్నారు.  అత్యంత సంపన్నవంతులైన 10 శాతం భారతీయ జనాభా 80.70 శాతం దేశ సంపద స్వంతం చేసుకుంది. 


ఈ విషయం ప్రపంచంలో సంపద పంపిణీ ఎలా జరుగుతుందో ప్రతిధ్వనిస్తూ చెపుతుంది. ప్రపంచ తొలి 10 శాతం  అత్యంత సంపన్నుల వద్ద 2015 లో 87.70 శాతం విశ్వ సంపద కాగా అది 2016 వరకు 89 శాతానికి చేరుకుంది. 



మొత్తం మీద భారత్ లో వ్యక్తిగత గృహసంపద 0.80 శాతం పడిపోయింది అంటే దేశం మొత్తం మీద అది $ 26 బిలియన్ ఉంటుంది. అదే 2016నాటికి $ 3 ట్రిలియన్లకు గత దశాబ్ధకాలంలో క్రమంగా పెరుగుతూ  చేరింది. 




2000 నుండి 2016, మద్య కాలంలో భారత వయోజనుల సగటు వార్షిక సంపద వృద్ది 6 శాతంగా రికార్డైంది. అంతకుమించి చెప్పాలంటే భారతీయుల వ్యక్తిగత సంపద అత్యధికం అంటే 86 శాతము స్థిరాస్థి స్వర్ణాభరణాలు తదితర  రూపాలలోనే ఉంచుకుంటుంది. 




ప్రపంచపు 1శాతం అత్యధిక సంపన్నవంతులలో భారతీయులు  248,000 మంది ఇప్పటికే తమ స్థానం పదిలపరచుకున్నారు. అంటే  "వరల్డ్స్ రిచెష్ట్ వన్ పర్సెంటు జనాభాలోభారతీయులు 248000 మంది ఉన్నారు" కాబట్టే,  ఈ విశ్వంలో - పేద జనాభాతో నిండిన సుసంపన్న దేశం భారత్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: