కర్ణాటకలో కాంగ్రెస్ కు ఏలిననాటి శనిపట్టిందా! ఇక దెవేగౌడ శాసిస్తాడు కుమారగౌడ పాటిస్తాడు.

కర్ణాటక ప్రభుత్వం ఇంకా సరిగా నేలకొనలేదనే చెప్పొచ్చు. మంత్రులెవరైనా వారిపై వారి చుట్టూ అనుక్షణం జెడిఎస్ అధినేత దేవే గౌడా పర్యవేక్షణ ఉంటుంది. ఆయన కనుసన్నల లోనే మంత్రివర్గం పనిచేయవలసిన పరిస్థితులు నేలకంటున్న దాఖలాలు స్పష్టంగా కనిపీస్తున్నాయి.  రాష్ట్రంలో దశాబ్దకాలం తర్వాత అధికారం లోకి వచ్చిన "జేడీ(ఎస్)-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం" లో మంత్రుల ఎంపిక లోనే కాదు వారి వ్యక్తిగత సహాయకుల (పీఏ) ఎంపికలోనూ మాజీ ప్రధాని, జెడిఎస్ అధినేత హెచ్ డి దేవెగౌడ నేత్రుత్వం కీలకపాత్ర పోషిస్తుంది.

కర్ణాటక ముఖ్యమంత్రి నేత్రుత్వంలోని 34 మంది మంత్రిమండలి సభ్యులకు పీఏల ఎంపిక కోసం కూడా మాజీ ప్రధాని దేవెగౌడ తెర వెనుక కసరత్తు చేస్తున్నారు. దీనికి ఆయన చెప్పే కారణం ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురాకుండా ఉండేలా సమర్ధులైన పీఏల ఎంపిక జాబితాను రూపొందిస్తున్నారని సమాచారం. పీఏ పోస్టు కావాలంటే దేవెగౌడను సంప్రదించండి అంటూ ప్రత్యక్షంగా మంత్రులే చెపుతున్నారని అంటున్నారు. దీంతో పీఏ పోస్టుల కోసం పలువురు అధికారులు పద్మనాభనగర్ లోని మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి తరలివస్తున్నారు. 


పీఏ పోస్టు పొందటానికి అధికారులు దేవెగౌడ ఇంటి ముందు ఆయనను ప్రసన్నం చేసుకొవటానికి "క్యూ" కడుతున్నారని సమాచారం. అర్హులైన పీఏల జాబితాను తెరవెనుక దేవెగౌడ సిద్ధం చేస్తున్నారని కర్ణాటక రాజకీయ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక సీఎం హెచ్ డి కుమారస్వామితో పాటు 34 మంది మంత్రులకు పీఏల ఎంపిక కోసం కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

ప్రభుత్వ పరిపాలనలో కీలకపాత్ర పోషించనున్న మంత్రుల ఎంపిక, పీఏల ఎంపికలో మాజీ ప్రధాని దేవెగౌడ సూపర్ ముఖ్యమంత్రిగా ఉంటారని కుమారస్వామి నామమాత్రమేనని యదార్ధంగా  చెప్పాలంటే పడగనీడ పర్యవేక్షణలో మంత్రులు పని చేయవలసి వస్తుందని, "78 ఎమెల్యే స్థానాలు గెలిచి న కాంగ్రెస్ సభ్యులకు అధిష్టానం, 36 స్థానాలు ముక్కుకుంటూ గెలిచిన జెడిఎస్ అధినేత పాదాల చెంత పడేయటంతో, పడగనీడలో పనిచేయాల్సి రావటంతో  - దీన్ని "శని పట్టటం కాక మరేమిటంటున్నారు" కొంతమంది స్వాతంత్ర ప్రియులైన కాంగ్రెస్ వాదులు. 

ఇక దెవేగౌడ శాసిస్తాడు కుమారగౌడ పాటిస్తాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: