కాపు ఓటు బ్యాంకు మొత్తం జగన్ మోహన్ రెడ్డి జేబులో…!

KSK
వైసిపి అధినేత రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్రంలో అనేక సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా లభించదని తూర్పుగోదావరి జిల్లా నేను పెట్టిన జగన్ కి తూర్పుగోదావరి జిల్లా వాసులు బ్రహ్మరథం పట్టారు. ఈక్రమంలో గోదావరి బ్రిడ్జి పైన జగన్ పాదయాత్ర చేస్తుంటే బ్రిడ్జి మొత్తం కదలడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఇదే విషయం సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉన్నదన్న విషయం జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ నాయకులకు అర్థం అయింది.

ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు చేసి నిండా రాష్ట్ర ప్రజలను యువకులను ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని మోసం చేసిన చంద్రబాబుకి రాబోయే ఎన్నికలలో గట్టిగానే బుద్ధి చెప్పాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఇదిలావుండగా తాజాగా జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర లో తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న నేపథ్యంలో ఈ యాత్ర లో కాపులు ఎక్కువ సంఖ్య లో కనపడడం టీడీపీలో కొంత భయం పట్టుకుంది.

గత ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు కాపులే కారణమనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఈసారి మాత్రం జగన్ వెంట కాపులు అడుగులు వేస్తున్నట్లు ఈ యాత్ర తో అందరికి అర్ధం అవుతుంది. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ టీడీపీకి ప్రచారం చేయుట వల్ల కూడా ఎక్కువ శాతం కాపు ఓటింగ్ టీడీపీ కి మళ్లింది. అలాగే గోదారి ఒడ్డున… కడపకు మించిన ఆదరణ వస్తుండటంతో టీడీపీలో కలవరం మొదలయింది.

అంతేకాదు జ్యోతుల నెహ్రు సైతం వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. అయితే గత ఎన్నికలలో కాపులను బీసీల్లో చేరుస్తాను అని చెప్పి తీవ్రంగా మోసం చేసిన చంద్రబాబు పై కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎంతగానో ఆగ్రహంతో  ఉన్నారు. అదే సమయంలో రాష్ట్రాన్ని ప్రజలను కాపాడగలిగే నాయకుడు జగన్ అంటూ కాపు ప్రజలందరూ బలంగా నమ్ముతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: