బాబు కు 'ఆ' కులం అంటే చులకన... ఇప్పుడు మాత్రం వారి ఓట్లు కావాలి..!

Prathap Kaluva

చంద్ర బాబు నాయుడు రోజుకో మాట పూటకో మాట  చెప్పడం లో సిద్ధహస్తుడు. ఈ రోజు చెప్పిన మాట మీద రేపు నిలబడడు దీనినే అవకాశ వాదం అంటారేమో...! అయితే చంద్ర బాబు నాయుడు ఇంతకు ముందు ఎస్సి కులం లో పుట్టాలని ఎవరు మాత్రం అనుకుంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బీజేపీ తో తెగదింపులు చేసుకున్న తరువాత వారు గుర్తొచ్చినట్టున్నారు. 


అయితే  ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరి సీటులో పోటీ చేసే వర్ల రామయ్య మాదిగవాళ్లను అంత దారుణమైన మాటలు అన్నాడు. ఈయనే వెళ్లి ఎస్సీ అట్రాసిటీ చట్టం నిర్వీర్యం అయిపోతోందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాడు పాపం! అయినా ‘ఎవరు కాని ఎస్సీ కులంలో పుట్టాలని అనుకుంటారు..’ అని వ్యాఖ్యానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన నాయకత్వంలోని పార్టీ వారు ఎస్సీల హక్కులు, అట్రాసిటీ చట్టం గురించి మాట్లాడటానికి మించిన విడ్డూరం ఏముంది? ఎస్సీలంటే బాబుకు ఎంత చులకనభావమో.. దాన్ని బయట పెట్టుకోవడానికి కూడా ఆయన వెనుకాడకపోవడాన్ని ఇక్కడ గమనించవచ్చు.


అయితే ఈ మధ్య తెలుగుదేశం పార్టీకి ఎస్సీల ఓట్లపై కొత్త ఆశలు మొదలయ్యాయి. ఆయనకు బీజేపీ మీద మనసు అయ్యిందంటే దళితుల, ముస్లింల గురించి అనవసరం. బాబు అవకాశవాదంలో ఇదొక ఎపిసోడ్. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ముస్లింల, దళితుల ప్రస్తావనే చేయడు. బీజేపీతో ఎప్పుడు తెగదెంపులు చేసుకుంటే అప్పుడు.. బీజేపీతో కలవడం పాపం అని, అది పొరపాటు అని, నమ్మి మోసపోయాను అని, ఇక కలవనే కలవను అని అంటాడు. మళ్లీ మామూలే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: