జాతీయ పప్పు రాహుల్ మాటలపై నెటిజెన్స్ విమర్శలు

నరెంద్ర మోడీపై ఈ దేశ వివిధ ప్రాంతీయ పార్టీల రాజకీయ నాయకుల వ్యతిరేఖత రాహుల్ గాంధీని భావి ప్రధాన మంత్రి ఊహించుకునేలా చేసింది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నేడు  ఊహించుకుంటున్నారు. తొలుత దేశాన్ని నడిపించ గలిగే సత్తా, సామర్ధ్యం ఆయనలో ఉందా? లేదా? అనే చర్చలు జరుగు తున్నాయి. దీనిపై అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. ఎప్పుడు ఏం మాట్లాడాలో ఆయనకు తెలియ దని చాలా మంది ఆరోపిస్తున్నారు. 

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయనేతగా ఆయనను కాంగ్రేస్ వాదులు ఊహించుకుంటున్నట్లు ఆయన ఎదగాలి, నిరూపించుకోవాలి అని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు విమర్శకులు మొన్న జరిగిన ఒక తాజా సంఘటనను ఆయన తెలివితేటలకు ఉదాహరణగా చెపుతూ ఉన్నారు.  ఈ మధ్య న్యూఢిల్లీలో  “కాంగ్రెస్ పార్టీకి చెందిన అధర్ బాక్వర్డ్ క్లాసెస్ కార్యకర్తలు” సమావేశం జరిగింది. కార్యకర్తలను ఉద్దేశించి ఆ పార్టి అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. 

మన దేశంలో ఓబీసీల అభివృద్దికి అడ్డంకులు ఎదురవుతున్నాయని అన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా సహాయం వారికి అందడం లేదన్నారు. చిన్నచిన్న వ్యాపారుల కు సహాయం చేయలేని బ్యాంకులు తలుపులుమూసి ఉంచుతున్నాయని అంటున్నారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి  అభివృద్ది ఎలా? జరిగిందనటానికి తనకున్న "హాఫ్-నాలెడ్జ్-అర్ధపరిఙ్జానం" తో ఒక కథ చెప్పారు అదే ఇది. 

అమెరికాలో నిమ్మరసం అమ్ముకునే వ్యక్తి - కోకా-కోలాను స్థాపించారని, రోడ్డు పక్కన ఓ దాబా నడుపుకునే వ్యక్తి మెక్‌డొనాల్డ్‌ ను స్థాపించారని, పెద్ద పెద్ద కంపెనీలైన ఫోర్డ్, మెర్సిడెస్, హోండా వంటివి మెకానిక్‌లతో ప్రారంభమయ్యాయని చెప్పారు. ఓబీసీలను కార్పొరేషన్లు, పార్లమెంటు, శాసనసభల్లో చూడాలనుకుంటు న్నట్లు రాహుల్ చెప్పారు. ఓబీసీలు రాజకీయంగా, సామాజికంగా ఎదిగేందుకు తాను అవకాశాలు కల్పిస్తా నని భరోసా ఇచ్చారు.
 
ఇక్కడ రాహుల్ గాంధి మాటలలోని అఙ్జానాన్ని గమనించిన రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు ఆయన పరిఙ్జానానానికి లోకఙ్జానానినికి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కోకా-కోలాను స్థాపించిన వ్యక్తి నిమ్మ రసం అమ్ముకోలేదని, ఆయన ‘జాన్ పెంబర్టన్’ ఒక ‘ఫార్మసిస్టు’ వివరంగా చెప్పేస్తున్నారు. మార్ఫిన్ అనే మాదక ద్రవ్యానికి బానిసయిన ఆయన గంజాయి లేని ‘పెయిన్ కిల్లర్’ తయారీ కోసం పరిశోధన చేసి, ‘కోకా’ అనే మొక్క నుంచి కషాయాన్ని తయారు చేసి, తాగాడని వివరించారు. దానికి మరికొన్ని పదార్థాలను కలిపి “కోకా-కోలా” ను తయారుచేసి, అమ్మడం మొదలు పెట్టినట్లు చెప్పారు. 

రాహుల్ గాంధీ ఈ విషయం తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. రాహుల్ ప్రస్తావించిన మరొక కంపెనీ ‘మెక్‌డొనాల్డ్’ దీనిని రిచర్డ్ మెక్‌డొనాల్డ్ మరియు మారీస్ మెక్‌డొనాల్డ్ ఇద్దరు అన్నదమ్ములు స్థాపించాౠ. వీరు మన అఙ్జాని అన్నట్లు దాబాలను, కాకా హోటళ్ళను నడప లేదు. వీధి పక్కన మాంసం బజ్జీలను అమ్ముకునేవారని తెలిపారు.
 
చిన్న వ్యాపారులకు బ్యాంకు ఋణాలు అందకపోవడానికి కారణం జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ అమలు చేసిన ఆర్ధిక విధానాలే కారణమని, వారి హయాంలో ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వమే నియంత్రించేదని చెబుతున్నారు. ఓబీసీలకు సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యం ఇస్తానంటున్న రాహుల్ గాంధీకి అసలు ఓబీసీలు ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారో కూడా తెలియని అఙ్జాని రాహుల్ అని ఋజువైందిప్పుడు. 

ఆయనకు మండల్ కమిషన్ గురించి కూడా ఏమీ తెలియదని విశ్లేషకులు అంటున్నారు. స్థానికసంస్థలు, శాసనసభలు, పార్లమెంటు వీటిల్లో ఓబీసీలకు ఉన్న ప్రాధాన్యం గుఱించి అంతకంటే తెలియదనటానికి ఉదాహరణ మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ“ఓబీసీ నేత”అని కూడా తెలియకపోవటమే. జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో చాలా స్థాయిలల్లో “ఓబీసీ నేత” లే సారథులని రాహుల్ గాంధి తెలుసుకుంటే మంచిది.  

ఇంత మాత్రమూ రాజకీయాలు తెలియని రాజకీయవేత్త రాహుల్ ఇంత పెద్ద దేశానికి, ఇంత అత్యధిక జనవాహినికి నాయకత్వం వహించే లక్షణాలున్నాయని దేశం గురించి తెలిసిన వారెవరూ నమ్మడం సాధ్యం కాదంటున్నారు నెటిజెన్స్. భారత్ లాంటి సువిశాల దేశం ప్రపంచంలోని రెండవ అధిక జనవాహినికి నాయకత్వం వహించే నేత ఇంత అఙ్జానంతో కునారిల్లుతుంటే మన మానవ వనరులు ఎంత గుణాత్మకంగా ఉన్నాయా? అని ప్రపంచం అనుకోదా? అదీ "ప్రపంచాన్ని భారత్ ముందు నిలబెట్టిన నరెంద్ర మోడీ" కి ప్రత్యామ్నాయమా? సిగ్గుచేటు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: