ఆ విషయంలో ఫ్యాన్స్ కి పవన్ గట్టిగానే..

Edari Rama Krishna
గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న లింగమనేని ఎస్టేట్స్ లో దశావతార వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నిన్న విగ్రహప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గణపతి సచ్చిదానందస్వామి సమక్షంలో ఇద్దరూ మాట్లాడుకున్నారు. గత కొంత కాలంగా టీడీపీ వర్సెస్ జనసేన ఏ రేంజ్ లో మాటల యుద్దం కొనసాగుతుందో అందరికీ తెలిసిందే.  అయితే పవన్ కార్యకర్తలు, ఫ్యాన్స్ ఏ చిన్న చాన్స్ దొరికినా టీడీపీ ని ఏకిపడేసుందకు కంకనం కట్టుకున్నారు. 

ఆ మద్య నీతి ఆయోగ్ సమావేశంలో, ప్రధాని మోడీకి, చంద్రబాబు షేక్ హ్యాండ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో వైసీపీ, జనసేన ఎంత గోల చేసిందో చూసాం. దేశం మొత్తం, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులకు, ప్రధాని వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరిస్తే, ఆ సందర్భంలో చంద్రబాబు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీనికి ఎదో ఒంగిపోయాడు అని, లొంగిపోయాడు అని, పిచ్చ ప్రచారాలు చేసారు.

టీ బ్రేక్ సమయంలో, ప్రధాని మోడీ, అందరి ముఖ్యమంత్రులని పలకరిస్తూ, మమత, చంద్రబాబు, కుమారస్వామి దగ్గరకు వచ్చి, వీరిని కూడా పలకరించారు. దీని పై రచ్చ రచ్చ చేశారు. తాజాగా పవన్ తన ఫ్యాన్స్ కి గట్టిగా బుద్ది చెప్పారు. తన మర్యాదను అపార్థం చేసుకోవద్దని పవన్ అన్నారు. "రాజకీయ విభేదాలను నేను సిద్ధాంతాల పరంగానే చూస్తా. వ్యక్తిగతంగా చూడను.

ఇది కొరవడటం వల్లే వైసీపీ, టీడీపీలు అసెంబ్లీ సమావేశాలను సక్రమంగా నిర్వహించలేకపోయాయి. నాయకులు ఎవరైనా కలిసినప్పుడు మంచిచెడ్డలను అడిగి తెలుసుకోవడం ఒక మర్యాద. మా గత రాజకీయ ప్రయాణం వల్ల నేను కలిసే నేతలైనా, విష్ చేసే నేతలైనా నేనేమిటో వారికి తెలుసు. నా మర్యాదను మరోలా అర్థం చేసుకోవద్దు" అంటూ ట్వీట్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: