చిరంజీవి పవన్ కళ్యాణ్ లకు షాకింగ్ ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు..!

KSK
వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని  తెలుగుదేశం అధినేత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికలలో అనేక అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను నిలువునా మోసం చేసిన చంద్రబాబు పై ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ముఖ్యంగా గత ఎన్నికలలో చంద్రబాబు కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి దాన్ని కేంద్రం దగ్గర వీగిపోయేలా గా వ్యవహరించడంతో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు చంద్రబాబు తమకు చేసిన ద్రోహాన్ని బట్టి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

దీంతో ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్న నేపద్యంలో కాపు సామాజిక వర్గాన్ని తిరిగి మంచి చేసుకోవడానికి చంద్రబాబు ఆ సామాజికవర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ చిరంజీవి లకు బడా ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గత ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ప్రసన్నం చేసుకుని కాపు వాట్లను తెలుగుదేశం పార్టీ వైపు పడేలా చంద్రబాబు చాలా తెలివిగా వ్యవహరించారు. అయితే ఆ తరువాత ఎన్నికలలో గెలిచాక చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి విభజనకు గురై నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో తీవ్ర అవినీతికి తెర లేపడం తో...పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని వీడి చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేసి గత మార్చి నెలలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగిన సమయంలో గుంటూరు వేదికగా చంద్రబాబుపై తెలుగుదేశంపై మరిముఖ్యంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసి బయటకు వచ్చేయడం జరిగింది.

ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో చంద్రబాబు ఎలాగైనా మళ్లీ పవన్ ను దగ్గరకు చేసుకోవాలని, వచ్చే ఎన్నికల్లో పవన్ తో కలిసి పోటీ చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. ఇందులో భాగంగా బాబు ప్రయత్నాలు తీవ్రం అయినట్టుగా టాక్. ముందుగా మంత్రి కొల్లు రవీంద్రను చిరంజీవి దగ్గరకు పంపించడంలో కూడా అదే వ్యూహం ఉందని సమాచారం.

చిరంజీవి ద్వారా పవన్ కల్యాణ్ కు చెప్పించే ప్రయత్నం చేశారని సమాచారం. కొన్ని సీట్లను ఇస్తాం.. అన్నదమ్ములిద్దరూ కలిసి రావాలని కొల్లు రవీంద్రతో వర్తమానం పంపించాడట చంద్రబాబు నాయుడు. అయితే మరోపక్క ఇదంతా గమనిస్తున్న కాపు వర్గానికి చెందిన కొంతమంది మళ్లీ కనుక పవన్ కళ్యాణ్ చిరంజీవి చంద్రబాబుతో కలిస్తే వాళ్లకు ఉన్న పరువు మొత్తం పోతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు...ప్రస్తుతం కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎవరూ కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవిలా మాట వినే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: