పవన్ "సంచలన నిర్ణయం"....పశ్చిమలో "మొదటి సీటు వారికే "

Bhavannarayana Nch

పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో ఒక ప్రభంజనాన్ని సృష్టించాడు..చంద్రబాబు కి ఓటు వేయండి మీ వెంట నేను ఉన్నాను హామీలు అమలు చేయకపోతే ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ అప్పట్లో సైలెంట్ గా ఉన్నాడు తరువాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేముందు వరకూ చంద్రబాబు పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. అయితే ఏ పని చేయలన్నా  ప్రతీ  పనికి వ్యూహం ఉంటుందని ఆ వ్యూహాన్ని అనుసరించే మనం వెళ్ళాలని అంటాడు పవన్ కళ్యాణ్ అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ ఒక పక్క చంద్రబాబు ని విమర్శిస్తూనే మరో పక్క జగన్ పై కూడా విమర్శలు చేస్తూ బ్యాలెన్స్ రాజకీయాలు చేయడం మొదలు పెట్టాడు..అయితే

 

బీజేపి వ్యూహంలో భాగమా లేక వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమో కానీ  మొత్తానికి వచ్చే ఎన్నికలకి టీడీపీ తో కలిసి ఉండకూడదు అని ఫిక్స్ అయ్యారు..అందులో భాగంగానే వ్యుహత్మకంగా బాబు ,చిన్నబాబు లోకేష్ లపై సంచనల ఆరోపణలు చేశారు..అవినీతి మరకలు అంటించాడు..అయితే గత ఎన్నికల్లో పవన్ వలన తెలుగుదేశం వైపుకి తిరిగిన వారిని ఎలా అయినా సరే తనవైపుకి తిప్పుకోవాలని తండ్రీకొడుకు ఇద్దరిపై తీవ్రమైన విమర్శలు చేశాడు..

 

ఇదిలాఉంటే  గతంలో కంటే కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంతో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాడని తెలుస్తోంది. రాజకీయాలలో ఆవేశంగా మాట్లాడితే సరిపోదూ ఎంతో వ్యుహత్మకత ఉండాలి..చాణిక్య నీతి పాటించాలని భావించాడు పవన్ అందుకు తగ్గట్టుగానే గత కొంతకాలంగా ఎంతో మంది వ్యుహకర్తలతో ఒక్కొక్కరిగా సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు...కొన్ని కీలక అంశాలపై చర్చించాడు..ఈ చర్చలలో భాగంగా అందరూ ఇచ్చిన సలహా ప్రకారం పవన్ పశ్చిమ పై ఫుల్ కాన్సంట్రేషన్ చేశాడని  తెలుస్తోంది..అయితే పశ్చిమ వేదికగా పవన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట..

 

ఏపీ లో ఏ రాజకీయపార్టీ అధికారంలోకి రావాలన్నాసరే ముందుగా పశ్చిమలో ఉన్న అత్యధిక సీట్లు సాధించాలి.అందుకే తన సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లా పై టార్గెట్ పెట్టుకున్నాడు..అయితే ఈ వ్యూహం వెనుక బీజేపి పెద్దల సూచనలు కూడా ఉన్నాయట..అయితే తన వ్యూహంలో బాగంగా పశ్చిమ నుంచీ డెల్టా ప్రాంతంలో ఎదో ఒక స్థానంలో మొట్ట మొదటి సీటుని రైతులకి ఇవ్వాలని పవన్ భావిస్తున్నాడట..ఇదే నిర్ణయాన్ని పార్టీలో కీలక నేతలంకి చెప్పినప్పుడు వారుకూడా పవన్ నిర్ణయాన్ని సమర్దించారని తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా పేరు చెప్తేనే గుర్తుకు వచ్చేది పచ్చని పొలాలు..పంటలు..వాటిని పండించే రైతు..అలాంటి రైతుకి  ఇప్పటి వరకూ చట్టసభలకి వెళ్ళే అవకాశం ఏ పార్టీ ఆలోచన చేయలేదు. అయితే

 

ఈ నిర్ణయం గనుకా పవన్ ఆచరణలో పెడితే తప్పకుండా పశ్చిమలో రైతుల మనసు గెలిచినట్లే అయితే ఈ సీటు విషయంలో కూడా పవన్ మరొక ఆలోచన చేస్తున్నాడట..పశ్చిమలో సామాజిక వర్గాల వారిగా ఓటు శాతం చూస్తే బీసీలు అధిక శాతం మంది ఉన్నారు అయితే ఇదే బీసీల నుంచీ రైతు బిడ్డని ఎంపిక చేస్తే అటు రైతులని ఇటు బీసీలని ఒకేసారి ఆకర్షించిన వారు అవుతారు కాదా అని ఆలోచన చేస్తున్నారట అయితే ఈ విషయంపై సీక్రెట్ సర్వే పశ్చిమలో పవన్ చేయించినపుడు ప్రజల నుంచీ చదువుకున్న వారి  నుంచీ కూడా అనుకోండి స్పందన వచ్చిందట దాంతో ఈ విషయంలో పవన్ వెనక్కి తగ్గే ఆలోచనే లేదని అయితే డెల్టా లో ఏ ప్రాంతం నుంచీ రైతులకి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది..అయితే ఈ విషయాన్ని పవన్ అధికారికంగా వెల్లడిస్తారని అంటున్నాయి జనసేన వర్గాలు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: