నెల్లూరు రాజకీయం రసకందం లో... ఆనం కు ఆ సీటు దక్కేనా..!

Prathap Kaluva

ఇప్పడూ ఎవరి నోట విన్న నెల్లూరు రాజకీయాల గురించే అని చెప్పవచ్చు. ఎందుకంటే టీడీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ ని వీడుతున్నాడని ప్రచారం సాగడం. అయితే టీడీపీ ని వీడి వైసీపీ లోకి మారుతున్నాడని అంతా ఖాయం అయిపోయిందని మాటలు వినిపిస్తున్నాయి. అయితే నెల్లూరు రాజకీయాల్లో ఆనం బలమైన నాయకుడు అని చెప్పవచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్ లో మంచి నేత గా ఎన్నో గొప్ప గొప్ప పదవులు పొందినాడు. అయితే ఇప్పడూ ఆనం పరిస్థితి మొదటికి వచ్చిందని చెప్పవచ్చు. 


అయితే నెల్లూరు లో మేక పాటి ఫ్యామిలీ చాలా పవర్ ఫుల్ అని చెప్పవచ్చు. అయితే ప్రస్థుతం మేకపాటి రాజమోహన్ రెడ్డి రిటైర్ అవుతాడని ప్రచారం కొనసాగుతుంది. ప్రస్తుతం మేకపాటి తనయుడు గౌతమ్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చేసారి గౌతమ్ రెడ్డిని ఎంపీగా పోటీ చేయించాలనేది మేకపాటి వ్యూహంగా వార్తలు వస్తున్నాయి. మేకపాటి రిటైర్మెంట్ అంటూ ఒక ప్రచారం సాగుతుండగా, ఆయన వచ్చేసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.


ఆత్మకూరు సీటు నుంచి తను పోటీ చేసి, తనయుడిని ఎంపీగా పోటీ చేయించాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి అనుకుంటున్నారట. ఈ విధంగా సీట్ల మార్పు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి అయితే వైసీపీలో కానీ, నెల్లూరు రాజకీయంలో కానీ మేకపాటి ఫ్యామిలీ హవా కొనసాగుతూ ఉంది. ఒకవేళ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలోకి చేరితే ఆత్మకూరు సీటు విషయంలో ఆయన ఆశలు పెట్టుకునే అవకాశాలున్నాయి. అయితే ఆనం వస్తే వెంకటగిరి నుంచి పోటీ చేయించాలనేది వైసీపీ అధిష్టానం భావనగా వార్తలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: