శ్రీవారి ఆభరణాల వివాదంపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

శ్రీవారి ఆభరణాల విషయంలో వస్తున్న వివాదాత్మక ఆరోపణలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. సోమవారం (జూన్ 25) అమరావతిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈ విషయమై ప్రధాన మరియు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ప్రతి రెండేళ్లకు ఒకసారి శ్రీవారి ఆభరణాలపై "ప్రత్యేక కమిటీ" తో న్యాయ విచారణ చేపడతామని ప్రకటించారు.


ఆ కమిటీ ముందే ప్రతి రెండేళ్లకోసారి ఆభరణాల పరిశీలనచేస్తామన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దెవస్థానం ఒక దార్మిక సంస్థ అని దానిలో రాజకీయాలకు తావు ఇవ్వకూడదనేది తమ చర్యల ఉద్దేశమని చంద్రబాబు చెప్పారు. 

కొంతమంది లేని నగలు, డైమండ్లు పోయాయంటూ రాజకీయాలు చేస్తున్నారని పరోక్షంగా రమణ దీక్షితులు ఆరోపణలపై మండిపడ్డారు. విపక్షాలు చివరకు దేవుడిని కూడా వదిలిపెట్టడం లేదన్నారు. శ్రీవారికి ఆగమ శాస్త్రం ప్రకారమే కొండపై అన్ని కార్యక్రమాలూ జరుగుతున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలు చివరకు దేవుడిని కూడా వదలడం లేదని ఆయన అన్నారు. 


ఇదిలావుంటే, శ్రీవారి ఆభరణాలు భద్రంగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు అన్నారు. రమణదీక్షితులు తాను చేసిన ఆరోపణ లను నిరూపించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సవాల్ చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: