వనరుల వేటలో జనసేన !

Seetha Sailaja
ఈసంవత్సరం చివరకు లేదంటే వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు రావడం ఖాయం అన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపధ్యంలో అన్నిరాజకీయ పార్టీలు తమతమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూ గెలుపు అంతిమ లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. అనునిత్యం సమస్యలతో సతమతమైపోతున్న ఆంధ్రప్రదేశ్ లో కూడ పూర్తి ఎన్నికల వాతావరణం హోరెత్తి పోతూ ఉండటంతో అసలు రాష్ట్రంలో పరిపాలన జరుగుతోందా అనే అనుమానాలు చాలామందికి కలుగుతోంది. 

రాబోతున్న ఎన్నికలను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ లు ఇప్పటికే తమ వ్యూహాలతో దూసుకుపోతుంటే పవన్ ‘జనసేన’ మాత్రం నత్త నడక నడుస్తూ రాబోతున్న ఎన్నికలలో తాము కూడ ఉన్నాము అన్న సంకేతాలు ఇవ్వగాలుగుతోంది కానీ ‘జనసేన’ కు రాబోయే ఎన్నికలలో 7-10 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వేలు తెలియ చేస్తున్నాయి. దీనితో రాబోతున్న ఎన్నికలలో ‘జనసేన’ అధికారంలోకి రావడం పగటికల అయినప్పటికీ  ‘జనసేన’ వల్ల నష్టపోయే పార్టీ ఏది అన్న విషయమై ఇప్పుడు లోతైన సర్వేలు జరుగుతున్నాయి. 

పైకి ధైర్యం ప్రదర్శిస్తూ ఉన్నా ‘జనసేన’ చీల్చబోయే ఓట్లు తమకు ఏమేరకు కీడు చేస్తాయి అన్న టెన్షన్ లో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం టెన్షన్ పడుతోంది. ఇలాంటి పరిస్థుతులలో సర్వేలను లెక్క చేయకుండా పవన్ తన ‘జనసేన’ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన అన్ని సీట్లలోను పోటీ చేస్తుందని ప్రకటించిన నేపధ్యంలో ప్రస్తుతం ‘జనసేన’ రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిధుల వేట పై దృష్టి పెట్టిందని సమాచారం. 

ప్రస్థుత రాజకీయాలలో ఎన్నికలు అంటే అంతా డబ్బు చుట్టూ తిరుగుతున్న నేపధ్యంలో పవన్ ఈ వాస్తవాన్ని విస్మరించి ‘జనసేన’ ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాలు దాటిపోయినా నిధుల సమీకరణలో పవన్ చేసిన నిర్లక్ష్యం ఇప్పుడు ‘జనసేన’ కు సమస్యగా మారింది అన్న వార్తలు రాజకీయ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి.  ఈవిషయమై ఆలస్యంగా మేలుకున్న ‘జనసేన’ కోర్ టీమ్ ‘జనసేన’ కోసం విరాళాలు సేకరించే పనిలో బిజీ అవుదామని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఊహించిన స్థాయిలో ‘జనసేన’ కు విరాళాలు రావడం లేదని వార్తలు హడావిడి చేస్తున్నాయి. దీనితో ఈ ఆర్ధిక కష్టాల నుండి ‘జనసేన’ ను గట్టెక్కించే ఆలోచనలలో భాగంగానే పవన్ తన ‘పోరాట యాత్ర’ కు బ్రేక్ ఇచ్చి ఈ ఆర్దికసమస్యలకు పరిష్కారాలు వెతుకుతున్నట్లు ఆర్ధిక వర్గాల టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: