ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ ఇంకా కలలు కంటుంది...!

Prathap Kaluva

ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో ప్రతిపక్షాలు చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ వారికి కూడా తెలుసు. ఇప్పడు ఆ పార్టీ పాతాళలోకానికి పడిపోయింది. రాష్ట్రాన్ని ఘోరంగా విడదీసి సరిదిద్దుకోలేని తప్పు చేసింది. దానికి తగ్గట్టుగా ప్రజలు బుధ్ధి చెప్పారు. ఇప్పడు కాంగ్రెస్ పార్టీ ఆ ఫలితాన్ని అనుభవిస్తుంది. అయితే కాంగ్రెస్ ఆంధ్ర ప్రదేశ్ లో బతికి బట్టకట్టడానికి నాయకులూ ఎదో కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. 


అసెంబ్లీ బరిలో ఈ ఏడాది రాష్ట్రంలో త్రిముఖ పోటీ జరగనుంది. ఇలాంటి పరిస్థితిలో తాము ఎంతగా ఫోకస్ పెట్టినా.. ఠికానా ఉండదనే సంగతి వారికి తెలుసు. అందుకని పార్టీలో మిగిలిన పెద్ద తలకాయలు, ప్రముఖ నాయకులు అందరినీ ఈసారి ఎంపీ బరిలో దించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే, అదృష్టం కూడా తోడైతే ఒకటో అరో ఎంపీ సీట్లు దక్కినా కేంద్రంలో తమకు కాస్త ఎడ్వాంటేజీ ఉంటుందని వారు కలగంటున్నారు.


ఆ క్రమంలో ఏపీ కాంగ్రెస్ పార్టీలో మిగిలిన నాయకులు రఘువీరారెడ్డి, పళ్లంరాజు, హర్షకుమార్, కోట్లలాంటి వాళ్లను ఎంపీ బరిలో దించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి పార్టీలో మిగిలిన చాలామంది గతంలో కూడా ఎంపీలే. ఎమ్మెల్యేలుగా ఉండే చాలామంది పార్టీని వీడిపోయారు. 2019 ఎన్నికల వరకు పూర్తి దృష్టిని ఎంపీ ఎన్నికల మీదనే కేంద్రీకరించాలని కాంగ్రెస్ అనుకుంటున్నట్లు కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: