ఆనం కు అన్ని చోట్ల అవమానాలే.. మరీ ఇప్పుడు ఏ పార్టీ..!

Prathap Kaluva

ఆనం రామనారాయణ రెడ్డి కాంగ్రెస్ లో మంత్రి గా ఒక వెలుగు వెలిగాడు.  ఎమ్మెల్యే గా గెలిచిన ఘణ  చరిత్ర ఉంది. కానీ ఏం లాభం ఇప్పడూ ఆనం కు ఏ పార్టీ లో కూడా ఆదరణ లభించేటట్లు కనిపించడం లేదు. వైసీపీ లో చేరడానికి జగన్ నుంచి స్పష్టమైన హామీ రావడం లేదు. నిజానికి ఆనం అవసరం జగన్ కు ఉందనుకుంటే ఆనం అడిగిన ఆత్మకూరు నియోజకవర్గం ఇచ్చేవాడేమో కానీ ఆ నియోజకవర్గం లో  గౌతమ్ రెడ్డి పోటీ చేయబోతున్నాడు. 


జగన్ ను కలిసిన ఆనం  ఎలాంటి ముందస్తు షరతులు, డిమాండ్లు లేకుండా చేరాలని జగన్‌ చెప్పడంతో షాక్‌ తిన్నారు. పార్టీలోకి అడుగు పెట్టకముందే అవమానం పాలయ్యారు. వైకాపా నుంచి ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేయాలని రామనారాయణ రెడ్డి అనుకున్నారు. కాని అది రిజర్వు అయిపోయింది. ఈయన సొంత నియోజకవర్గమైన ఆత్మకూరు నుంచి తాను పోటీ చేయబోతున్నట్లు మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఇదివరకే ప్రకటించాడు.


ఇక్కడి నుంచి ఆనంకు అవకాశం లేదు. దీంతో జగన్‌ చెప్పిన చోట పోటీ చేయాలి. రాజకీయాల్లో ఎంతో సీనియర్‌ అయిన రామనారాయణ రెడ్డి తాను కోరుకున్నది దక్కకపోవడం అవమానంగా భావిస్తున్నారు. కొత్త నాయకుడి మాదిరిగా జగన్‌ చెప్పినదానికి తల ఊపడం తన స్థాయికి తగదనుకుంటున్నారు. ఇప్పుడు ఈయన పరిస్థితి డైలమాలో పడింది. టీడీపీలో ఉండలేడు. వైకాపాలో చేరలేడు. ఆనం కోరుకున్నది జరిగితే చేరతాడనుకోండి. అది వేరే విషయం. కాని జరుగుతుందో లేదో తెలియదు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం పరిస్థితి ఇలా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: