ముంబయిలో భారీ వర్షాలు - డబ్బవాలా రద్దు!

Edari Rama Krishna
గత కొన్ని రోజులుగా ముంబయిలో కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడి లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా నీట మునిగాయి. ఈ భారీ వర్షాల కారణంగా అక్కడ జనజీవనం కూడా అస్తవ్యస్తమవ్వడం తో పలు చోట్ల లోకల్‌ రైళ్లు సర్వీసులకు కూడా బాగా ఇబ్బందులు నెలకొన్నాయి.  కొన్ని రైళ్లు రద్దు చేయగా, ఇతరులు 10 నుంచి 15 నిమిషాల పాటు ఆలస్యంగా నడుస్తుండగా,  రాత్రిపూట వర్షం రావడంతో జనజీవం స్థంబించిపోయింది. 

గత రాత్రి సుమారుగా 165.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రానున్న 24 గంటల్లో మరో 150 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ  తెలిపింది. భారీ వర్షాల కారణంగా  పలు విద్యా సంస్థలు మూతపడ్డాయి. ముంబై యూనివర్శిటీలోని అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. మరోవైపు ‘డబ్బావాలాలు’ మంగళవారం వారి సేవలను బంద్ చేసారు. 

నగరం అంతటా నీరు ఉన్న  కారణంగా మేము ఈ రోజు టిఫినీలను సర్వీసు చేయలేమని ముంబై డబ్బావాలాస్ అసోసియేషన్  ప్రతినిధి సుభాష్ తాల్కర్ తెలియజేశారు. కాగా, ముంబై యూనివర్శిటీలోని అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. 

లోకల్ ట్రైన్ లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు ముంబై సముద్రతీరాన్ని భారీ అలలు ఢీకొంటున్నాయి. నేవీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్  ఇతర విభాగాలు పరిస్థితి పర్యవేక్షిస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: