చంద్రబాబుతో భేటీ అయితే జగన్ ఏమనుకుంటే నాకెందుకు అంటున్న ఉండవల్లి..!

KSK
రాజమహేంద్రవరం మాజీ పార్లమెంటు సభ్యుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తో భేటీ అవ్వడం ప్రస్తుత రాజకీయాలలో అనేక చర్చలకు దారి తీసాయి. ఈ సందర్భంగా ఉండవల్లి చంద్రబాబుతో భేటీ అవ్వడం గురించి మీడియాతో ముచ్చటించారు….ఉండవల్లి మాట్లాడుతూ చంద్రబాబు భేటీలో ఎలాంటి రాజకీయాంశాలు తమ మధ్య చర్చకు రాలేదని చెప్పారు.


చంద్రబాబుతో భేటీ అయ్యానని జగన్ అభిమానులు ఏమనుకున్నా తనకు ఎలాంటి నష్టం లేదని, పార్టీలను కలిపే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రానికి సంబంధించి నిధుల విషయంలో కేంద్రం చేసిన మోసం గురించి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలిచినప్పుడు ఐ ఇష్టంతోనే వెళ్లానని చెప్పారు...


ఆ క్రమంలో జాయింట్ ఫాక్ట్స్ ఫైండింగ్ కమిటీ లో నాకు తెలిసిన విషయాలను కేంద్రం నుంచి సమాచారం ఎలా సేకరించారు అటువంటి విషయాలను పవన్ కళ్యాణ్ కి సూచించానని అని చెప్పుకొచ్చారు.


అయితే ప్రస్తుత బేటి  తాజాగా పార్లమెంటు సమావేశాలలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై చంద్రబాబు పోరాడాలని ఈ క్రమంలో విభజన చట్టంలో ఉన్న లొసుగులను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని పేర్కొన్నారు ఉండవల్లి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: