చంద్రబాబుపై స్వరం మార్చిన రమణదీక్షితులు…!

KSK
గతంలో తిరుమల తిరుపతి విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఆయన ప్రభుత్వంపై సంజన కామెంట్లు చేశారు ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు. ఆ సమయంలో రమణదీక్షితులు చేసిన కామెంట్లు రాజకీయంగా పెను దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా కొండమీద ఆలయంలో పవిత్రత కోల్పోయేలా చాలామంది వ్యవహరిస్తున్నారంటూ రాజకీయ నాయకులను ఉద్దేశించి రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టించాయి.


ఇదిలావుండగా తాజాగా ఇటీవల చెన్నైలో తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు రమణ దీక్షితులు. చంద్రబాబు చాలా మంచి వ్యక్తి అంటూ కితాబిచ్చిన రమణ దీక్షితులు, చిన్నప్పటి నుంచి తనకు ఆయన తెలుసని అన్నారు. ఎస్వీ యూనివర్సిటీలో చంద్రబాబు తనకు జూనియర్ అని, ఆయనతో తనకు మంచి సంబధాలు ఉండేవని తెలిపారు.


తామిద్దరం శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులమని, తామిద్దరి ఆలోచనలు కూడా ఒకటేనని రమణ దీక్షితులు పేర్కొన్నారు. రాజకీయ నాయకుడిగా రాష్ట్రమంతా బాగుపడాలని చంద్రబాబు కోరుకుంటారని, అలాగే స్వామివారి అర్చకుడిగా కొండపై అంతా బావుండాలని తాను కోరుకుంటానని తెలిపారు. కొంతమంది ప్రోద్బలంతోనే చంద్రబాబు తనకు వ్యతిరేకం అయ్యారని రమణ దీక్షితులు చెప్పారు.


గతంలో చంద్రబాబును కలుద్దామని అపాయింట్మెంట్ దొరికిన ఆయన ముఖ్యమంత్రి కావడం వల్ల బాబుతో కాలేక కుదరలేదని పేర్కొన్నారు మాజీ ప్రధాన అర్చకుడు దీక్షితులు. తాజాగా రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రరాష్ట్ర రాజకీయాలలో అనేక చర్చలకు తావిస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: