మంత్రి కేటీఆర్ కి ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరిన రేవంత్!

Edari Rama Krishna
తెలంగాణలో ఇప్పుడు రాజకీయ వేడి బాగా రాజుకుంటుంది.  ముఖ్యంగా కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మద్య కొంత కాలంగా మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే.  ఇక టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తాజాగా మంత్రి కేటీఆర్ కి ఓ ఛాలెంజ్ విసిరారు.  తెలంగాణ రాజకీయ నేతల్లో అందరికన్నా తాను ఫిట్ గా ఉన్నానని..అది ఎందులోనైనా సరే నిరూపించుకుంటానని అన్నారు.  అంతే కాదు  పొలిటికల్ ఫిట్ నెస్ లో తనతో పోటీపడేవారు ఎవరూ లేరని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు.

గతంలో తెలంగాణ ఉద్యమం ముసుగులో చిల్లర రాజకీయాలు చేసిన కేటీఆర్... ఇప్పుడు అధికారం ముసుగులో జులుం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఇక రాజకీయాల్లోకే కాకుండా ఏ ఆటలోనైనా తనతో పోటీపడేంత ఫిట్ నెస్ మంత్రి కేటీఆర్ కు లేదని అన్నారు. కేటీఆర్ వి అన్నీ ఫిట్ నెస్ లేని ఆటలేనని ఎద్దేవా చేశారు.

తనకు చేతనైతే కేటీఆర్ తనతోపాటు 10కే రన్ పోటీకి రావాలని, ఫిట్ నెస్ ను నిరూపించుకోవాలని రేవంత్ సవాల్ విసిరారు.  దాంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరింత సెగ పుట్టింది.  రాజకీయ బలాబలాలు ప్రజలు తేలుస్తారని..ఎన్నికల్లో నిలబడితే ప్రజలు తీర్పు ఇస్తారని ఇలాంటి ప్రగల్భాల వల్ల ఒరిగేది ఏమీ ఉండదని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: