రజినీకాంత్, కమలహాసన్ కు అంత సీన్ లేదంటా...!

Prathap Kaluva

తమిళ్ నాడు రాజకీయాలు ఎప్పడూ ఏ మలుపులు తిరుగుతాయో ఎవరికీ అర్ధం కానీ పరిస్థితి. ఎప్పుడైతే జయలలిత మరణించిందో అప్పటి నుంచి రాజకీయ అస్థిరత్వం నెలకొని ఉన్నది. అయితే ఈ గ్యాప్ లోనే కమల హాసన్ మరియు రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం తమిళ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అయితే రజినీకాంత్, కమల్ హాసన్ ప్రభావం ఎన్నికల్లో ఏ మేర ఉంటుందని తమిళ పత్రిక సర్వే నిర్వహించింది. 


తాజాగా ఒక తమిళ పత్రిక రజనీకాంత్, కమల్ హాసన్‌ల ప్రభావం గురించి తను చేసిన అధ్యయన ఫలితాలను ప్రచురించింది. అందులో చెప్పింది ఏమిటంటే.. అటు రజనీకాంత్, ఇటు కమల్ హాసన్ ప్రభావం తమిళ రాజకీయాలపై పెద్దగా ఏమీ ఉండదని ఆ పత్రిక పేర్కొంది.వారి ప్రభావం తమిళ రాజకీయాలపై ఉంటుందా? అంటే కేవలం పదిశాతం మంది మాత్రమే ఉంటుందని చెప్పారట. మిగిలిన వాళ్లలో 51శాతం మంది రజనీ, కమల్‌ల ప్రభావం తమిళ రాజకీయాలపై అస్సలు ఉండదని తేల్చేశారని సమాచారం.


మిగిలిన వారు మాత్రం కూడా కచ్చితంగా రజనీ, కమల్‌ల ప్రభావం ఉంటుందని చెప్పలేదని ఆ పత్రిక పేర్కొంది. ఏతావాతా ఈ హీరోల రాజకీయం పట్ల పాజిటివ్ అంచనాలతో ఉన్నది కూడా పదిశాతం మంది మాత్రమే అని ఆ పత్రిక పేర్కొంది. ఇదివరకూ కూడా పలు తమిళ మీడియా వర్గాలు రజనీ, కమల్‌లకు అంత సీన్ లేదనే విషయాన్ని ప్రముఖంగా పేర్కొన్నాయి. అయితే సినిమా వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లో అడుగు పెడితే గలవడం కష్టమైన విషయమే. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: