రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అమరుడైన వైసీపీ కార్యకర్త…!

KSK
ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడానికి ముందునుంచీ చిత్తశుద్ధితో పోరాడుతున్న ఏకైక పార్టీ వైసీపీ పార్టీ అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. విభజన సమయంలో ఆనాడు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీల లో ప్రధాన హామీ ప్రత్యేక హోదా. అయితే ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో ప్రజలను మోసం చేసి అబద్ధాలు చెప్పి అధికారమే పరమావధిగా అమలుచేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. ఈ క్రమంలో చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదాను కేంద్రం కాళ్ల దగ్గర పెట్టి రాష్ట్రాన్ని నిలువునా మోసం చేశారు.


అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి చెందుతుందని ముందు నుంచి ప్రతిపక్షనేత జగన్ పేర్కొనడంతో రాష్ట్రంలో ప్రతి సామాన్య ప్రజలు కూడా నమ్మడంతో చంద్రబాబు దిక్కుతోచక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి జరుగుతుందని జపం చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకుండా చేసిన నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ వైసీపీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు మృతిచెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో చోటుచేసుకుంది.


శాంతియుతంగా జరుగుతున్న బంద్‌ను టీడీపీ సర్కార్‌ విఫలం చేసేందేకు చేసిన కుట్ర వల్లే దుర్గారావు మృతిచెందాడని కుటుంబసభ్యులు, బంధువులు, పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజుతో కలిసి బుట్టాయగూడెంలో పార్టీ కార్యకర్త దుర్గారావు ఏపీ బంద్‌లో పాల్గొన్నారు. తెల్లం బాలరాజుతో పాటు దుర్గారావు, మరికొందరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు వారిని బలవంతంగా బుట్టాయిగూడెం పోలీస్‌స్టేషన్‌కు తరలించే యత్నం చేయగా తోపులాట జరిగినట్లు సమాచారం.


ఈ క్రమంలో దుర్గారవు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొంత సమయానికే దుర్గారావు చనిపోయారు. దుర్గారావు స్వస్థలం బుట్టాయిగూడెం మండలం కృష్ణాపురం. కాగా, దుర్గారావు మృతితో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి ని వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: