పవన్ పెళ్ళాల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు...!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ మీద జగన్ చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయం లో ఇప్పటికే పవన్ స్పందించాడు. టీడీపీ నాయకులూ కూడా పవన్ కు సపోర్ట్ చేసి జగన్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని రాజకీయంగా వాడుకోవాలని టీడీపీ నాయకులూ భావిస్తున్నట్టున్నారు. అందుకే నీతి మంతుల మాదిరిగా జగన్ కు ఎలా మాట్లాడాలో హిత భోద చేస్తున్నారు. 


అయితే తాజా గా ఇదే విషయం మీద ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఢిల్లీలో నిర్వహించిన ''మీట్ ది ప్రెస్''లో ఉండవల్లి మాట్లాడుతూ.. పవన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలను వీడియోలో చూడలేదు. కానీ పేపర్లో చూశాను. ఇది చాలా తప్పన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసే హక్కు జగన్‌కు లేదన్నారు. పవన్ కల్యాణ్‌కు ఎందరు పెళ్లాలో అన్నది వారే తేల్చుకోవాలన్నారు. ఐపీసీ చాప్టర్ 28 ప్రకారం మరొకరు కామెంట్ చేయకూడదన్నారు.


పవన్ కల్యాణ్ అన్న వాడికి ఎంతమంది పెళ్లాలు ఉన్నారనేది.. ఆ పెళ్లాలే తేల్చుకోవాలన్నారు. అంతేకానీ మనకు అందులో సంబంధం లేదని ఉండవల్లి చెప్పారు. ఏ పెళ్లాన్నైతే ఇబ్బంది పెట్టారో ఆ పెళ్లాం కోర్టుకు వెళ్లొచ్చు. అంతేకానీ, మనకేమీ కామెంట్ చేసే అధికారం లేదని తెలిపారు. జగన్ వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయాలను కలుషితం చేయడం కిందకే వస్తుందన్నారు. రాజకీయాలకు దానికి సంబంధం లేదన్నారు. వ్యక్తి అలవాట్లు చూసి ఓట్లు వేయరని.. ఆ వ్యక్తి వల్ల ఎంత వరకు మేలనే విషయం చూసి ఓట్లు వేస్తారన్నారు. తాను ఒకరికి దగ్గర.. మరొకరి దూరం కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌‌కుమార్‌ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: