ఆంధ్ర ప్రదేశ్ కు జరిగిన అన్యాయానికి వెంకయ్య నాయుడు అసంతృప్తి... ఇపుడేం ప్రయోజనం...!

Prathap Kaluva

ఆంధ్ర ప్రదేశ్ నుంచి ముఖ్య బీజేపీ నాయకుడైన వెంకయ్య నాయుడు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ నాయకుడు కాబట్టి ఎదో సాధిస్తాడు అని చాలా మంది  ఆశలు పెట్టుకున్నారు. చివరికీ ఆంధ్ర ప్రదేశ్ కు జరిగిన అన్యాయం లో వెంకయ్య కి భాద్యత ఉన్నదన్నది వాస్తవం. ఇప్పుడేమో ఆయన ఉప రాష్ట్ర పతి అయినాడు. ప్రభుత్వం తరపున యథాతథంగా హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తన వాదన వినిపించారు.


టీడీపీ ఎంపీలు వెంకయ్య నాయుడి ప్రస్తావన పదేపదే తీసుకురావడంతో 'నాకన్నీ తెలుసు. ఆ రోజు సభలో ఏం జరిగిందో తెలుసు. ఎవరికి అన్యాయం జరిగిందో తెలుసు. కానీ నేను ఇప్పుడున్న పరిస్థితిలో ఏమీ మట్లాడలేను. రాజ్యసభ ఛైర్మన్‌గా నా అభిప్రాయాలు చెప్పలేను' అన్నారు. దీన్నిబట్టి చూస్తే కేంద్రం తీరుపై ఆయనకు అసంతృప్తిగా ఉందనిపిస్తోంది. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మంత్రులతో మాట్లాడి సాధ్యమైనంతవరకు స్వరాష్ట్రానికి నిధులు ఇప్పించడం, అవసరమైన అనుమతులు ఇప్పించడం, కేంద్రానికి-రాష్ట్రానికి సంధానకర్తగా వ్యవహరించడం... ఇలా ఏదోవిధంగా కృషి చేశారు.


కేంద్రంలో వెంకయ్య ఉన్నాడనే ధైర్యం బాబు ప్రభుత్వానికి ఉండేది. కాని వెంకయ్య ఉప రాష్ట్రపతి అవడంతోనే పరిస్థితి తారుమారైంది. ఆయనను ఆ పదవి వరించినప్పుడు ఆయనతోపాటు ఎవ్వరూ సంతోషంగా లేరని చెప్పొచ్చు. ఈ పదవి తనకు భార్య లేని జీవితంలా ఉందని ఓ సందర్భంలో అన్నారు. ప్రజలను కలుసుకోలేని నేతగా మిగిలిపోయానన్నారు. 'వేదికపైకి రావాలి. రాసిచ్చిన నాలుగు మాటలు మాట్లాడి, నమస్తే చెప్పిపోవాలి. ప్రజలను కలవకుండా, మాట్లాడకుండా ఈ జీవితంలో ఇంకేముంది? ఏం చేయాలో తెలియడంలేదు. అని చాలా సార్లు వాపోయాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: