బాలకృష్ణ శాతకర్ణి సినిమాకు హైకోర్ట్ నోటీసులు: బాబు కు చట్టం సమాధానం

నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం "గౌతమి పుత్రశాతకర్ణి" కు తగలాల్సిన ఝలక్ న్యాయస్థానం ఇచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పన్ను రాయితీ పొందిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు కోర్టు నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ సినిమాకు అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పోటీలు పడి రాయితీలు ఇచ్చాయి. ఈ సినిమా తెలుగు వారి చరిత్ర కు సంబంధించిన సినిమా అని మినహాయింపును ఇచ్చారు. 

సాధారణ నీతి నియమాలు నిజాయతీలు మాకొద్దు కుల బంధు ప్రయోజనాలే మాకు పరమార్ధం 


గౌతమి పుత్రశాతకర్ణి కి మాత్రం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తనే మెచ్చి తనంతట తానే వినోదపు పన్ను మినహాయింపును ఇచ్చింది.  అయితే రుద్రమదేవి వంటి సినిమాకు మినహాయింపును ఇవ్వని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బాలకృష్ణ నటించిన ఈ సినిమాకు మాత్రం మినహాయింపును ఇవ్వడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. నందమూరి బాలకృష్ణ తెలుగు దేశం పార్టీ శాసనసభ్యుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మొదట బావమరిది ఆపై ఆయన కూతురు బ్రహ్మిణి ని తన కుమారుడు మంత్రి లోకెష్ తో వివాహం  వియ్యంకుడు అయ్యాడు. తన పార్టీ శాసనసభ్యుడు దానితో పాటు వియ్యంకుడు అయినందు వలననే రాయితీలు పుక్కటగా ఇచ్చారనే ప్రచారం జరిగింది.


ఎవరెన్ని విమర్శలు చేసిన తగ్గే రకం కాదుకదా ముఖ్యమంత్రి!  ఈ విమర్శలు వచ్చినా చంద్ర బాబు ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. ఆ సంగతి నీతి, నియమాలు, నిజాయతి పాటించేవాకి కాని నిప్పు లాంటి చంద్రబాబుకు కాదుకదా!  "ఇలా పన్ను మినహాయింపు పొంది, ఆ ప్రయోజనాలను సినిమా చూసే ప్రేక్షకులకు ఎందుకు కలిగించలేదని ఈ సినిమా కు నోటీసులు జారీ అయ్యాయి. పన్ను మినహాయింపు అంటే అది నిర్మాత జేబుల్లోకి వెళ్లింది తప్ప, ఆ మినహాయింపు ప్రయోజనం  సినిమా చూసే ప్రక్షకులకు చెందాల్సి ఉండగా ఆ సొమ్ము నిర్మాతల జేబులోకి వెళ్ళింది. ఇక్కడ ప్రయోజనాలు పొందాల్సిన ప్రేక్షకులకు ఆ అదృష్టం కలగలేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఒక  పిటిషన్ దాఖలు అయ్యింది.

సాధారణంగా పన్ను మినహాయింపు పొందిన సినిమాల టికెట్ ధరలను ఆ మేరకు తగ్గించాలి. అయితే "గౌతమిపుత్ర శాతకర్ణి" సినిమా విషయంలో అది జరగలేదని పిటిషనర్ పేర్కొన్నాడు. పన్ను మినహాయింపు పూర్తిగా నిర్మాతల జేబుల్లోకి వెళ్లిందని పేర్కొన్నాడు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరాడు. దీనిపై స్పందిస్తూ ఆ సినిమా నిర్మాతలకు, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకూ నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తోంది.

ఇంత చిన్నవిషయంలోనే ముఖ్యమంత్రి బందుజన స్వార్ధం వదులుకోలేదంటే ఇకరాష్ట్రంలో ఆయన కులం,బందుత్వం పార్టీ సభ్యులు కాని వారి జీవితాలు ఎలా ఉంటాయో? వారి పట్ల ఆయన అనుసరించే పక్షపాతం ఎంత దుర్మార్గంగా ఉంటుందో అర్ధం చేసుకోవటానికి ఈ ఉదాహరణ చాలు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: