స్టేజి పై నుంచి జారిపడ్డ ముఖ్యమంత్రి!

Edari Rama Krishna
ఈ మద్య కొంత మంది నేతలు స్టేజీ పై నుంచి పడటమో..లేదా ఆ స్టేజీలు కూలడమో జరుగుతున్నాయి.  వాస్తవానికి ముఖ్య అతిధిలు వచ్చే సమయానికి కార్యకర్తలు, సిబ్బంది సభా ప్రాంగనాన్ని ఒకింత చెక్ చేసుకోవడం జరుగుతుంది.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు సభలు కూలిపోతుంటాయి..దాంతో సభలో పాల్గొన్న ముఖ్యనేతలు గాయాలు కావడం కూడా జరుగుతుంది. తాజాగా మధ్యప్రదేశ్ లో సీఎం ఒక సభ వేదిక పై ప్రసంగం ముగించి దిగుతుండగా జారీ పడ్డారు. 


 అసలు విషయం ఏమిటంటే, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివ రాజ్ సింగ్ చౌహన్ ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో విస్తృతంగా యాత్రలు జరుపుతున్న అయన, నిన్న జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా చటర్ పూర్ జిల్లా చంద్లా నియోజకవర్గం వారు నిర్వహించిన ర్యాలీ లో పాల్గొన్నారు.  జన ఆశీర్వాద్‌ యాత్రలో భాగంగా గురువారం సాయంత్రం ఛటర్‌పూర్‌ జిల్లా చంద్లా నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. 


 కార్యక్రమం గురించి ప్రసంగించిన ఆయన కిందకు దిగే క్రమంలో  ఒక్కసారే జారిపడిపోయారు.  వెంటనే సిబ్బంది, కార్యకర్తలు అలర్ట్ కావడంతో ఆయన్ని కిందపడకుండా పట్టుకున్నారు.  దాంతో ఆయన కు ఎలాంటి ప్రమాదం జరగలేదు.  అయితే కిందకు దిగే సమయంలో అది మెట్టు అనుకొని పొరపాటున కాలు వేయడంతో ఒక్కసారి జారిపోయారని..వెంటనే ఆయనను రక్షించగలిగామని వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. కాగా, మధ్య ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జన ఆశీర్వాద్‌ యాత్ర చేపట్టిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. వరుస పర్యటనలతో బిజీగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: