పవన్ కళ్యాణ్ మాటల్లో ''అర్ధాలు'' వెతికితే నర మేధ మానవుడికి కూడా దొరకువు...!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ స్టేజి మీద ఆవేశంగా మాట్లాడుతుంటాడు. పవన్ మాట మీద నిలబడడు  అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. మొన్నటివరకు నాకు అధికారం అవసరం లేదు. అధికారం లేకపోయినా సమస్యలు పరిష్కరించ వచ్చు అని అన్నాడు. ఇప్పుడేమో నాకు ఓట్లు వేయండి. నన్ను సీఎం ను చేయండి అని అంటున్నాడు. నాకు ఎమ్మెల్యేలు. ఎంపీలు లేక పోవడం వల్లే నేను పోరాడ లేకపోతున్న అని అంటాడు. నాకు ఎన్నికల్లో ఒక్క సీటు రాకపోయినప్పటికీ అసెంబ్లీ ముందు కూర్చుంటా అంటాడు... మరీ ఇప్పుడు అతనికి ఎమ్మెల్యేలు ఎంపీ లు లేరు కదా అసెంబ్లీ ముందు కూర్చో వచ్చు కదా..!


గతంలో పలు సందర్భాల్లో పవన్‌, 'చంద్రబాబు సర్కార్‌పై పోరాడటానికి మాకు ఎమ్మెల్యేల బలం లేదు.. నరేంద్రమోడీపై పోరాడటానికి నాకు ఎంపీల బలం లేదు..' అని సెలవిచ్చారు. అప్పటికీ, ఇప్పటికీ పవన్‌లో ఏం మార్పు వచ్చిందో ఏమో. 2009 నుంచి ఇప్పటిదాకా.. దాదాపు పదేళ్ళలో తనకు చాలా అనుభవం వచ్చేసిందని పవన్‌కళ్యాణ్‌ అంటున్నారు. ఈ పదేళ్ళలో రాజకీయంగా పవన్‌కళ్యాణ్‌ యాక్టివ్‌గా వున్నది ఎంత కాలమో ఆయనే సమాధానం చెప్పాలి.


భీమవరంలో డ్రెయిన్ల కంపుని, టీడీపీ అవినీతి పాలనతో పోల్చిన పవన్‌, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పైనా పరోక్షంగా విరుచుకుపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు నెల రోజులపాటు పర్యటించనున్నారట పవన్‌. ఆ తర్వాత నెల రోజులు తూర్పుగోదావరి జిల్లాకి కేటాయిస్తారట. ఈ రెండు జిల్లాల్లో 'కాపు సామాజిక వర్గం' ఓటు బ్యాంకు అత్యంత కీలకం కావడంతో, మిగతా జిల్లాలతో పోల్చితే ఉభయ గోదావరి జిల్లాలపై పవన్‌ మరింత ఎక్కువ ఫోకస్‌ పెట్టినట్లే కన్పిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: