"కాపులకు రిజర్వేషణ్లు కల్పించలేను - అది రాష్ట్ర పరిధి అంశం కాదు" వైసిపి చీఫ్ జగన్మోహనరెడ్డి

ఎన్నికలు దగ్గరవుతున్న వేళ ఆంధ్ర ప్రదేశ్ లోని అధిక జనాభా కలిగిన సామాజిక వర్గం - కాపుల రిజర్వేషన్ అంశం పై జగన్ కుండబద్దలు కొట్టారు. తాను చెయ్యగలిగింది మాత్రమే చెప్తాను, చేయలేనిది ఎప్పుడు చెప్పను అని "కాపుల రిజర్వేషన్లు" తాని కల్పించలేనని చెప్పారు. నాది కానిది నా పరిధిలోలేనిది వేరొకరి ఆదీన అంశం పై  మాటివ్వలేనని కరాఖండిగా చెప్పేశారు జగన్.  ప్రజా సంకల్ప యాత్ర చేస్తోన్న జగన్, నిన్న సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట బహిరంగసభలో చెప్పారు. 

తాను అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇవ్వలేనని, తాను నిజమే చెబుతానని, చేయగలిగింది మాత్రమే చెప్తానని వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధి లో ఉండే అంశం కాదని, రిజర్వేషన్ల కోటా యాభై శాతం దాటితే అమలు చేయలేమని చెప్పారు. కేంద్రం పరిధిలో ఉన్న అంశంపై చేస్తానని చెప్పలేనన్నారు. చెపితే చేయగలగాలి. చేయగలిగిందే చేస్తానని హామీ ఇస్తానని అదే తన విధానమన్నారు. అందువల్ల తాను రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇవ్వలేనని అన్నారు.

రేజర్వేషన్లు 50 శాతం మించి ఉండటం జరిగితే  "రిజర్వేషన్ రాష్ట్రం పరిధిలో ఉండదు" అని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఈ విషయంలో స్పష్టంగా ఉన్నాయని, నేను శాసనసభలో అమోదించిపంపితే కేంద్రం ఆమోదించాలని లేదని-అలవి కాని హామీలిచ్చి కాపులను మభ్యపెట్టలేనని స్పష్టంచేశారు.  కానీ కాపులకు అన్యాయం జరుగు తోందని మొదటిసారి గళమెత్తింది కూడా నేనేనని ఆయన అన్నారు. వారికి అన్యాయం జరుగుతుందన్న వాదనా, పోరాటం మొదలు పెట్టింది తానేనని గుర్తు చేశారు.

కాపు కార్పోరేషన్ కు చంద్రబాబు కేటాయించిన నిధుల కన్నా రెట్టింపు నిధులు కేటాయిస్తానని ఆయన చెప్పారు. కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి బాబు కేటాయించిన నిధులకు (₹5 వేల కోట్లు) దానికి రెట్టింపు నిధులు మాత్రం తాను కేటాయిస్తానని ఇది రాష్ట్రప్రభుత్వ పరిధిలోని అంశం, కాబట్టి మీకు హామీ ఇవ్వగలుగుతున్నానని ఆయన చెప్పారు. 

టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర పరిధిలో ఉందా? లేదా? అని అలోచించకుండా ఎన్నికల్లో విజయమే పరమార్ధంగా హామీలు గుప్పించారని  అలాంటి వాటిల్లో కాపు రిజర్వేషన్ల హామీ ఒకటని కుండబద్ధలు కొట్టారు. ఎన్నికల ప్రణాళికలో ఒక్కో కులానికి ఒక్కో పేజీ కేటాయించి హామీలు ఇచ్చి ఆపై ఏ ఒక్క దాన్నీ అమలు చేయకుండా అన్ని కులాలను కూడా మోసం చేశారని అన్నారు. 

కాపులకు రిజర్వేషన్లు విషయంలో అత్యంత కీలక నిర్ణయాన్ని కాపు ప్రజానీకం అత్యధికంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అమలు చేయలేని మాట ఇవ్వను కానీ కాపులకు అండగా ఉంటాను అని జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. గతంలో కాపుల ఆందోళనకు వైసిపి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే, అందుకే ఎన్నికల ముందు కాపుల విషయంలో నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించడం విశేషం.

కాపు సోదరులు ప్లకార్డులు పట్టుకుని కనిపిస్తున్నారని, వారి పక్కనే ముద్రగడ పద్మనాభం కనిపిస్తారని, చేస్తానని చెప్పిందే చేయాలని, అడిగితే చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసునని ఆయన అన్నారు. ముద్రగడ పద్మనాభంను గృహంలోనే నిర్బంధించారని, ఆడవాళ్లని కూడా చూడకుండా ఆ కుటుంబ స్త్రీలపై పోలీసులు దౌర్జన్యం చేశారని ఆయన అన్నారు.

చంద్రబాబు నాయుడి ప్రభుత్వ కార్యక్రమాలపై "ఎల్లో మీడియా" అన్నీ అబద్ధాలు రాస్తోందని ఆయన అన్నారు. రైతు రుణాల మాఫీపై, పొదుపు పథకాలపై అటువంటి ప్రచారమే చేసిందని ఆయన అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: