కాపు రిజర్వేషన్ అసాధ్యం...మరో అద్భుత హామీ ప్రకటించిన జగన్..!

KSK
వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో అనేక సంచలనాలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో పవన్ కళ్యాణ్.. జగన్ ల మధ్య వివాదం రచ్చ రచ్చ చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల తన పాదయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జగన్ కాపులను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆంధ్ర రాజకీయాలలో పెను సంచలనాలు సృష్టిస్తోంది.


ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో జగన్ మాట్లాడుతూ 2014 ఎన్నికలలో కాపు సామాజిక వర్గాన్ని తీవ్రంగా మోసం చేసింది చంద్రబాబే అని పేర్కొన్నారు. ఆచరణ కానీ రిజర్వేషన్ హామీని ఇచ్చి  చంద్రబాబు కాపులను నిలువునా మోసం చేశారని...రాష్ట్రంలో కాపులను మోసం చేసింది చంద్రబాబే అని మొట్టమొదటి పేర్కొన్నది వైఎస్ఆర్సిపి పార్టీ అని కూడా అన్నారు. అయితే ఈ క్రమంలో సభలో ఉన్న కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన యువకులు కాపు సామాజిక వర్గం పై మీ వైఖరి చెప్పాలని ప్లకార్డులు ప్రదర్శించడంతో వెంటనే ప్రతిస్పందించి ఈ పాయింట్ తోనే నలభై ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబు గత ఎన్నికల్లో కాపులను వంచించారు.


అధికారంలోకి రాకపోయినా సరే, అబద్ధాలు, మోసాలు చేయబోనని చాటుతూ రిజర్వేషన్లు అసాధ్యం అని జగన్ ప్రకటించడం ద్వారా ఆయన సాధారణ రాజకీయ నాయకుడు కాడని, ఎంతో పరిణితి కలిగిన రాజకీయవేత్త అని రుజువు అవుతున్నది. ఈ రిజర్వేషన్ల అంశంతోనే వీపీ సింగ్ అనే ధూర్తుడు దేశాన్ని నాశనం చేశాడు ముప్ఫయి ఏళ్లక్రితం. జగన్ రాజకీయ విచక్షణకు అభినందనలు.


అంతేకాకుండా వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్ కమిటీకి చంద్రబాబు కంటే రెండింతలు నిధులు కేటాయిస్తామని చెప్పారు. నిర్మొహమాటం లేకుండా జగన్ ఆచరణ కానీ హామీలను ఇవ్వడం చేతకాదని చెప్పడంతో కాపు సోదరుల మనోనేత్రాలు తెరవబడ్డాయి అని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. మొత్తంమీద చూసుకొంటే జగన్ చేసిన ప్రకటన వైఎస్ఆర్సిపి పార్టీకే లాభమని అన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: