ఆ రోజు వస్తే భారతీయుల మనసులు పులకరించి పోతాయి..!

Prathap Kaluva

మనకు  స్వాతంత్రం రాకపోయుంటే మనం ఈ దేశం లో ఇంత స్వాతంత్రంగా ఉండే వారిమీ కాదు. బానిస బతుకుల తో ఇప్పటికే అందులోనే మగ్గి పోతు ఉండేవారిమి. ఈ స్వేచ్చా వాయువుల వెనుకా ఎందిరో మహానుభావుల త్యాగ ఫలం ఉంది. దాదాపు రెండు వందల ఏళ్ల బ్రిటీష్ పాలన నుంచి అఖండ భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చిన ఆ శుభ దినాన్ని తల్చుకుంటే జైహింద్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా ప్రతి భారతీయుని కంఠం ధ్వనిస్తుంది.


మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, సంస్కృతులు వేరైనా మేమంతా భారతీయులమన్న భావం ప్రతివారిలో ప్రజ్వరిల్లుతుంది. విభిన్న సంస్కృతులకు, విభిన్న ఆచారాలకు ఆలవాలమైన భారతావనిలో విదేశీయులు ప్రవేశించి భారతీయులనందరినీ బానిసలుగా చేసి రాజ్యమేలిన చీకటి రోజుల నుంచి తొలిసారి వెలుగులను చవిచూసిన ఆగస్టు 15 అంటే భారతీయులకు అతి పెద్ద శుభదినం.


తరాలు మారినా మనుషులు మారినా ఆ శుభదినాన ప్రతి ఒక్కరు భరతమాతను ఒక్కసారైనా మదిలో తల్చుకుంటారు. అదేసమయంలో భారతమాత దాస్య శృంఖాలలను తెంచేందుకు ప్రాణాలను తృణప్రాయంగా భావించిన అమర వీరులను సైతం ప్రతి ఒక్కరు స్మరించుకుంటారు. ఈనాడు తాము అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా వాయువుల కోసం ఆనాడు పోరాడిన ప్రతి ఒక్కరికీ వారు శిరస్సు వంచి నమస్కరిస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: