జగన్ అడుగు కోసం భారీ ఏర్పాట్లతో ముస్తాబవుతున్న విశాఖ జిల్లా..!

KSK
వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. ఈ క్రమంలో జగన్ ఎక్కువ పాదయాత్ర చేసిన జిల్లాగా  తూర్పుగోదావరి జిల్లా నమోదయింది ప్రజా సంకల్ప పాదయాత్రలో. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా ఉండే కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశించి జగన్ చేసిన కామెంట్లు రాజకీయంగా ఆంధ్రరాష్ట్ర పాలిటిక్స్ ని హిట్ పెంచాయి.


ముఖ్యంగా కాపు సామాజిక వర్గం పై నిర్మొహమాటంగా చిత్తశుద్ధితో జగన్ చేసిన కామెంట్లు పై మొదటిలో కాపులు నుండి వ్యతిరేకత వచ్చినా కానీ తరువాత అసలు విషయాన్ని అర్థం చేసుకుని జగన్ కి జై కొట్టారు. ఈ క్రమంలో త్వరలో తూర్పుగోదావరి జిల్లాలో తన పాదయాత్ర ముగించుకుని...విశాఖ జిల్లాలో జగన్ అడుగు పెట్టనున్న నేపథ్యంలో...ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు విశాఖ జిల్లాలో జగన్ ఎంట్రీ అదిరిపోయేలా ఉండాలని వైసీపీ కార్యకర్తలకు మతిపోయేలా ఏర్పాటు చేస్తున్నారు.


పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ రూట్ మ్యాప్‌ను ఖ‌రారు చేశారు. గన్నవరం మెట్టు వద్ద రాజన్న తనయుడి పాదయాత్ర జిల్లాలో ప్రవేశిస్తుందని చెప్పారు. విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో 210 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందని, 7 బహిరంగ సభల్లో వైయ‌స్‌ జగన్‌ పాల్గొంటారని.. 25 రోజుల పాటు జిల్లాలో పర్యటన ఉంటుందని వెల్లడించారు.


మరోపక్క ఇటీవల తన ప్రజా సంకల్ప పాదయాత్రలో గోదావరి బ్రిడ్జిపై, కృష్ణానదిపై జగన్ చేసిన పాదయాత్ర చారిత్రాత్మకంగా నిలిచిపోవడంతో విశాఖ జిల్లాలో కూడా అదే స్థాయిలో ఉండాలని విశాఖ వైసీపీ కార్యకర్తలు నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క పాదయాత్ర ముగింపు దశలో చేరుకుంటున్న నేపథ్యంలో జగన్ కూడా రాజకీయంగా విశాఖ నుండి సంచలనం సృష్టించే హామీలు ఇవ్వబోతున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: