తెర చాటు కాంగ్రెస్ టీడీపీ భందం బలపడుతుంది... ఇదే నిదర్శనం..!

Prathap Kaluva

టీడిపి పార్టీ కి మొదటి నుంచి శత్రువు కాంగ్రెస్ పార్టీ... స్వర్గీయ తారక రామ రావు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత తో టీడీపీ పార్టీ ని స్థాపించాడు. అయితే ఇప్పడూ చంద్ర బాబు కాంగ్రెస్ తో చేతులు కలపడానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది. నిజానికి రాష్టానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే తరువాత బీజేపీ వచ్చి చేరింది. అది మరిచి టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్ చేతులు కలపడం పార్టీ నేతలకు నచ్చడం లేదు. 


రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి టీడీపీ మద్దతివ్వడం, ఈరోజు పార్లమెంటు సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీలను స్వయంగా సోనియాగాంధీ కలిసి అభినందించడం.. కాంగ్రెస్‌ - టీడీపీల మధ్య బలోపేతమైన బంధాన్ని చెప్పకనే చెప్పేశాయి. పార్లమెంటులో మోడీ సర్కార్‌కి వ్యతిరేకంగా మీరు చేస్తోన్న పోరాటం అద్భుతం..' అంటూ సోనియాగాంధీ, టీడీపీ ఎంపీల్ని అభినందించారు.


మరీ ముఖ్యంగా, ఇటీవలి కాలంలో రకరకాలైన వేషధారణలతో పార్లమెంటులో హల్‌చల్‌ చేస్తోన్న టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ వద్దకు వెళ్ళిన సోనియా, 'మీ నిరసనలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి... చాలా బాగా చేస్తున్నారు..' అని అభినందించారట. సోనియాగాంధీతోపాటు పలువురు కాంగ్రెస్‌ ముఖ్య నేతలు, టీడీపీ ఎంపీలతో రెగ్యులర్‌గా టచ్‌లో వుంటున్నారిప్పుడు. నిన్న మొన్నటిదాకా విభజన పాపానికి సంబంధించి కాంగ్రెస్‌ని తొలి ముద్దాయిగా భావించిన టీడీపీ, ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి బీజేపీని తీసుకొచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: