తణుకులో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై మండిపడ్డ నెటిజన్లు..!

KSK
తాజాగా ఇటీవల తణుకు నియోజకవర్గంలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తానని సిలిండర్ ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు పెద్ద ప్రకటనగా తెగ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు.


ప్రజలకు కావాల్సింది గ్యాస్ కనెక్షన్ కాదు అని ప్రజలకు తాగునీరు విద్య వైద్యం అని సంచలన కరమైన కామెంట్లు చేశారు. ప్రస్తుతం సమాజంలో పేదవాడు చదువుకు దూరం అయ్యాడని ఫీజుల కట్టలేని స్థితిలో ఉన్నారని అంటున్నారు నెటిజన్లు. అంతేకాకుండా ఏరోజుకారోజు బ్రతికే పేదవాడు తనకు అనారోగ్యం వస్తే కనీసం వైద్యం చేసుకునే స్థితిలో కూడా లేరని పేర్కొన్నారు.


ఇటువంటి విషయాలను పరిగణలోకి తీసుకుని వైసీపీ అధినేత జగన్ రాష్ట్రంలో ప్రతి పేదవాడు రానున్నరోజుల్లో బ్రతికేలా హామీలు ప్రకటిస్తుంటే...పిచ్చిపిచ్చి హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అలాగే ఆయన కార్యకర్తలకు అభిమానులకు సూచించారు నెటిజన్లు. గ్యాస్ కనెక్షన్ మహా అయితే కుటుంబానికి సంవత్సరానికి నాలుగు సార్లు అవసరమవు తుందేమో కానీ విద్య, నీరు, వైద్యం...మనిషి జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు నెటిజన్లు.


అయినా ఎన్నికల ముందు చంద్రబాబుని విభేదించి బయటకు వచ్చి ఇప్పుడు నేను పతివ్రతను నేను మోసపోయాను అని అంటే రాష్ట్రంలో ఏ ప్రజలు నమ్మరని చాలా ఘాటైన కౌంటర్లు వేసారు సోషల్ మీడియాలో నెటిజన్లు. వచ్చేఎన్నికలలో ఇటువంటి హామీలు ఇచ్చి ఎన్ని కుయుక్తులు పన్నినా పవన్ కళ్యాణ్ కనీసం ప్రతిపక్ష పాత్రలో కూడా ఉండరని అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: