గోదావ‌రి న‌ది ఉద్ధృతి..ధవళేశ్వరం బ్యారేజ్‌ గేట్లు ఎత్తివేత!

Edari Rama Krishna

గత కొన్ని రోజులుగా ఎడ‌తెరిపి లేని వర్షాలకు తోడు ఉప నదుల నుండి వస్తున్న వరద నీటితో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.  ప్రధానంగా ఉపనది శబరి పొంగుతోంది. దీనితో ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి వడివడిగా పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీరుతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మంగళవారం ఉదయం ఏడు గంటలకు గోదావరి నీటిమట్టం 8.20 అడుగులకు చేరుకుంది.  


ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 8.20 అడుగులకు చేరుకుంది. దీంతో ధవళేశ్వరం 175 గేట్లు ఎత్తి 6 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. భద్రాచలం వద్ద 38.1 అడుగల వద్ద నీటిప్రవాహం కొనసాగుతుంది. దీంతో మరింత వరద ధవళేశ్వరానికి చేరే అవకాశముంది. అలాగే డెల్డాలకు7100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. 


భద్రాచలం వద్ద 38 అడుగుల వద్ద నీటిప్రవాహం కొనసాగుతోంది. ఈ కారణంగా మంగళవారం సాయంత్రానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: