టీడిపి కీ నీకు తేడా ఏముంది పవన్..!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక్క  హామీ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. టీడీపీ హామీలను కూడా దాటి పోయిందని చెప్పాలి. దీనిని అప్పట్లో టీడీపీ వారు నగదు బదిలీ పథకమని బాగా ప్రచారం చేసినారు. అయితే మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పుకొనే పవన్ అతను కూడా ఇటువంటి రాజకీయ పథకాలను ప్రకటించడం... చాలా మంది పెదవి విరుస్తున్నారు. వృద్ధాప్య ఫించను వెయ్యి రూపాయలకు చేరుకుంది.


వికలాంగులకు ఇచ్చే పెన్షన్‌ 1500 రూపాయల వరకూ వుంది. రేషన్‌ దుకాణాల్లో దొరుకుతోన్న సబ్సిడీ సరుకులకు బదులు, పవన్‌కళ్యాణ్‌ మహిళల పేరుతో, వారి ఖాతాల్లో నెలవారీ 2500 నుంచి 3500 రూపాయల వరకు వేస్తామంటూ, తమ పార్టీ విధానాన్ని ప్రకటించుకోవడంతో అంతా ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. పేదల్ని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఎంత పెద్దమొత్తాల్ని వెచ్చించినా, దాన్ని తప్పుపట్టాల్సిన అవసరంలేదు. అయితే, ఇలాంటి 'ఆఫర్స్‌'తో ఓట్లను దండుకోవడం, సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని, ప్రజాధనాన్నీ నిలువునా దోచేయడం కొత్తేమీకాదు.

వృద్ధాప్య ఫించన్లు కావొచ్చు, మరొకటి కావొచ్చు.. అధికార పార్టీకి చెందినవారికే ఇలాంటి పథకాలతో ఎక్కువ లబ్ది చేకూరుతుంటుందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. వ్యవస్థలో మార్పులు రాకుండా, ఇలాంటి పిల్లిమొగ్గలు ఎన్నివేసినా ఉపయోగం వుండదు.అబ్బే, పవన్‌ చెబుతున్నదంతా పాత వ్యవహారమే. కాపీ కహానీలు..' అంటూ మంత్రి యనమల రామకృష్ణుడు వెటకారం చేసేశారుగానీ, చంద్రబాబు హయాంలో పుట్టుకొస్తోన్న చాలా పథకాలు 'కాపీ ఫార్మాట్‌' కాక మరేమిటి.? 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: