అత్తాగారి కిట్లు - అల్లుడిగారి ఫీట్లు - హైకోర్ట్ మొట్టికాయలు

చంద్రబాబుకు జనం ఎందుకు ఒట్లేయాలి?  ఇది నేటి ప్రధాన ప్రశ్న.


తను, తన కుటుంబం, తన బందువులు, తన కులం, తన పార్టీ పరిది దాటి ఆలోచించే స్థాయిని కోల్పోయింది ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం. 


ఉదాహరణకు వినోదపు పన్ను రద్ధు చేసే విషయంలో తన బావమరిది, వియ్యంకుడు, తన సర్వస్వం అనుకునే నందమూరి బాలకృష్ణ పట్ల అవ్యాజమైన ప్రేమ ప్రదర్శించటంలో  "గౌతమీపుత్ర శాతకర్ణి" కి ఆ ప్రయోజనాన్ని తెలుగు నాట చరిత్ర సృష్టించిన కాకతీయ రాణి రుద్రమదేవి సినిమాని ఫణంగా పెట్టి మరీ అందించారు ఇక్కడ ఆయన స్వప్రయోజనం కనీసం ఇసుమంతైన ప్రజలు ఏమైనా అనుకుంటారేమోననే ఆలోచన కూడా  వదులుకొలేని ధౌర్భాగ్యాన్ని నిశ్శిగ్గుగా ప్రదర్శించారు.


అలాగే నేడు చంద్రబాబు నాయుడు తన అత్తగారు బసవతారకం పేరు మీద ప్రవేశ పెట్టిన "బసవ తారకం మదర్‌ కిట్‌ పథకం" పై  అక్రమాలు జరిగాయని పిటిషన్ దాఖ లైన దరిమిలా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పధకం అమలుపై నిషేధం విధించింది. అయితే నేడు ఈ పథకాన్ని (ఆగస్టు 15) లో ప్రారంభించాల్సి ఉంది. అయితే ఇందు లో చివరకు తన అత్తగారి పేరు మీద ప్రవేశ పెట్టిన పధకంలో కూడా అవినీతి ముద్రపడ కుండా అమలు చేయలేని ధౌర్భాగ్యం ఆయనను పట్టుకుందన్న మాట. అంతలా అవినీతి బట్ట బయలు కాగా తన పాలన క్రమానుగతంగా ప్రమాణాలను కోల్పోతూ క్షీణ దశకు చేరిందన్నది హైకోర్ట్ వరకు చేరింది.




ఆదిలోనే హంస పాదన్నట్లు అక్రమాలు కళ్లెదుట కనిపించడంతో ఈ పథకం అమలుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రి ల్లో ప్రసవించే బాలింత లకు ఒక చీర, ప్లాస్క్‌, స్కార్ప్‌, దుప్పటి, 40 శానిటరీ పాడ్స్ ఇవ్వనున్నారు. ఈ కిట్ల సరఫరాకు పిలిచిన టెండర్ల లో భారీగా అక్రమాలు జరిగాయని      మాయరిన్‌ అనే సంస్థ ప్రతినిధులు ఉమ్మడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఒక్కో కిట్‌ ను ₹1038/ -  సరఫరా చేసేలా ఒకరికి కాంట్రాక్టు అప్పగించారు. 


హైకోర్టులో విచారణ సందర్భంగా టెండర్ల ప్రక్రియ జరగాల్సిన విధానం గురించి ఆరోపిస్తూ "మదర్‌ కిట్‌ లో అందించే వస్తువులకు సంబంధించిన నమూనాలను ముందుగా సదరు సంస్థ జాతీయ కార్పొరేషన్‌ కు పంపాలి. ఆ కార్పొరేషన్‌ ఇచ్చే నివేదిక ను బట్టి, ఆ సంస్థకు టెండరును ఖరారు చేయాలా? వద్దా? అనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అయితే, ఇందుకు భిన్నంగా "పవన్‌ శిల్క్‌, అనిత టెక్స్‌" అనే కంపెనీ లకు ప్రభుత్వం ₹50 కోట్ల విలువైన టెండర్లు ఖరారు చేసింది" అని పిటిషనర్లు "మాయరిన్‌ అనే సంస్థ ప్రతినిధులు" ఉమ్మడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ఎ.రాజశేఖరరెడ్డి నిన్న అంటే మంగళవారంనాడు విచారించారు. అయితే ఈ పథకం అమలుకు ఎంపిక చేసిన సంస్థను నిబంధనలకు విరుద్దంగా ఎంపిక  చేశారంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన క్రమంలో న్యాయస్థానం ఆదేశాలననుసరించి ఈ పథకం అమలు నిలిచిపోయింది. 




ఈ తతంగానికి ముందుగానే


నిన్న మంగళవారం ఉండవల్లి ప్రజావేదిక హాలులో 'బసవ తారకం మదర్‌ కిట్లను' ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా కొందరు బాలింతలకు అందజేశారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ "వైద్యశాలలో అడుగు పెట్టి పురుడు పోసుకొని పండంటి బిడ్డను కన్న ప్రతి తల్లి, ఏ దశలోనూ ఎలాంటి ఇబ్బందికీ గురి కాకూడదని, తల్లి బిడ్డ సంతోషంగా ఆస్పత్రి నుంచి ఇంటికి క్షేమంగా చేరుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆశయం" అని చెప్పారు. 


ఈ పథకం అమలు చేయాలనే రాష్ట్రప్రభుత్వ నిర్ణయం గురించి వివరిస్తూ, "ప్రభుత్వాస్పత్రికి ప్రసవానికి వచ్చే గర్భిణులంతా దాదాపు నిరుపేదలై ఉంటారు. కనీసం మందులు కొనుక్కొనే స్తోమతా ఉండదు. ఇక ప్రసవం అనంతరం బాలింతలు ఆరోగ్య రక్షణకు తీసుకునే జాగ్రత్తలు శూన్యమే. రాష్ట్రంలో మాత, శిశు మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలనే నిర్ణయించుకొన్న ప్రభుత్వం, ప్రతి బాలింత ఆరోగ్య సంరక్షణకూ చర్యలు చేపట్టింది. దీనికోసం ఉద్దేశించినదే 'బసవ తారకం మదర్‌ కిట్‌ పథకం" అని వివరించారు. 



అసలు కథ 

ఇంతకంటే తక్కువ ధరకే కిట్లు సరఫరా చేస్తామంటూ మరో కంపెనీ టెండర్లు దాఖలు చేసింది. అదే కంపెనీ ఎల్‌-వన్‌ గా వచ్చింది. కానీ బాబు ప్రభుత్వం మాత్రం తక్కువ ధరకు కిట్‌ సరఫరాకు ముందుకొచ్చిన కంపెనీని తోసేసి తనకు కావాల్సిన వారికే టెండర్ కట్టబెట్టింది. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది. దీంతో ఎల్‌-వన్‌ గా నిలిచిన కంపెనీ హైకోర్టు తలుపు తట్టింది.


ఆశ్చర్యకరమైన విషయమేమంటే రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుని ఆధీనంలోనే ఉంది. ఇంత చిన్న పథకం లోనూ, అదీ తన ఆదీనంలో ఉన్న శాఖలో తన అత్తగారి పేరుమీద ప్రారంభించిన పథకంలో నైనా కనీసం  అవినీతి చేయకుండా వదిలిపెట్టలేదంటే ఇక భారీ ప్రాజెక్టుల్లో జరిగే అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవటం పెద్ద కష్టం కాదు అనే అభిప్రాయం అమరావతి ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ విధానం ఇలా ఉంటే అమరావతి ప్రజలు  విశ్వనగరం (అమరావతి) రూపురేఖలు ఎలాఉంటాయో ముందే ఊహిస్తున్నారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: