ఇక సెలవంటూ సేదతీరిన మహాయోగి!

Edari Rama Krishna

భారత రత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి శకం ముగిసింది. మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్‌పేయికి లక్షలాది ప్రజలు అశ్రునయనాల మధ్య ఢిల్లీ యమున తీరంలో స్మృతి స్థల్‌లో అంత్యక్రియలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.  ప్రియమైన బీజేపీ నేతలు, అభిమాన శ్రేణుల తుది నివాళుల మధ్య  అటల్‌జీ అంతిమసంస్కారాలు ముగిశాయి. ఈ సందర్భంగా చివరి సారిగా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్... వాజ్‌పేయి భౌతిక కాయాన్ని సందర్శించి పుష్పగుచ్ఛములుంచి చివరిగా నివాళులర్పించారు.


కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తదితరులు బహుముఖ ప్రజ్ఞాశాలి వాజ్‌పేయికి తుది వీడ్కోలు పలికారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు వాజ్‌పేయికి కడసారి నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలు కాలి నడకన వాజ్‌పేయి అంతిమయాత్రలో పాల్గొన్నారు. 


వాజ్‌పేయికి స్మృతి స్థల్‌లో  విదేశీ ప్రతినిధులు హాజరై అశ్రునయనాలతో తుది నివాళులర్పించారు.కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, అమిత్‌షా, అడ్వాణీ, మన్మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.


త్రివిధ దళాలు వాజ్‌పేయికి ప్రభుత్వ లాంఛనాలతో నివాళులర్పించాయి.  21 సార్లు గాలిలో తుపాకులు పేర్చి గౌరవవందనం సమర్పించాయి. ఆయన చితికి దత్తపుత్రిక నిప్పటించారు. తాత అటల్‌జీ నుంచి ఎప్పుడూ బహుతులను అందుకునే ఆయన మనవరాలు నిహారిక తాత భౌతిక కాయాన్ని చూసి తీవ్రంగా రోదించింది. ఆమెను చూసి పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: