ఆంధ్రాలో అన్ని సర్వేలలో జగన్ దే హవా స్పష్టం..!

KSK
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న తరుణంలో రాష్ట్రంలో ప్రధాన పార్టీ అధ్యక్షులు ప్రజలలో ఉంటూ హామీలు ఇస్తూ పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ముందుగా వైసీపీ నేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర పేరిట రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేయడానికి సిద్ధపడి ఇప్పటికే రాయలసీమ ప్రాంతం గోదావరి జిల్లాలు ముగించుకుని ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ముందుగా విశాఖపట్టణంలో అడుగుపెట్టారు జగన్. 2014 ఎన్నికలలో విజయం సాధించిన చంద్రబాబు తన పరిపాలనను హైదరాబాద్ నగరంలో మొదలుపెట్టిన ఆ సందర్భంలో జరిగిన కొన్ని అవినీతి కార్యక్రమాల వల్ల హైదరాబాదును విడిచి తన పాలనను విజయవాడ నగరం నుండి పర్యవేక్షించడం చేశారు చంద్రబాబు.


అయినాగాని ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో చంద్రబాబు ఇచ్చిన హామీలు రాష్ట్రంలో నెరవేర్చకుండా తన పాలనను సాగిస్తున్న నేపద్యంలో చంద్రబాబు ప్రభుత్వంపై అతి తక్కువ కాలంలోనే ప్రజావ్యతిరేకత నెలకొంది. మరిముఖ్యంగా కేంద్రం నుండి రాష్ట్రానికి న్యాయపరంగా విభజన హామీలు కూడా అధికారంలో ఉంది చంద్రబాబు తీసుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా చంద్రబాబుని అసహ్యించుకోవడం మొదలుపెట్టేశారు.


మ‌రో ప‌క్క ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉండిపోరాటాలు సాగించ‌టంతో ప్ర‌జ‌ల్లో ఆయ‌న ప‌ట్ల న‌మ్మ‌కం క‌ల‌గ‌టానికి దోహ‌దం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో ఆయ‌న సుదీర్ఘంగా సాగిస్తున్న పాద యాత్ర ఏపీ చ‌రిత్ర‌లో కొత్త అధ్య‌యం సృష్టిస్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. జ‌గ‌న్ బ‌హిరంగ‌స‌భ‌కు హాజ‌ర‌వుతున్న ప్ర‌జ‌లు, జ‌గ‌న్ ప‌ట్ల వారు క‌న‌బ‌రుస్తున్న ఆధ‌రాభిమానాలు చూస్తుంటే జ‌గ‌న్ ప‌ట్ల వారు సానుకూలంగా ఉన్నార‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతుంది.


అంతేకాకుండా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి అని చాలా కసిగా ప్రజలు తమ ఓటు ద్వారా తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ అధినేత జగన్ కచ్చితంగా బలమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని నిర్మిస్తారని అంటున్నాయి రాష్ట్రంలో జరిగిన సర్వేలు. మరి ఈ వచ్చే ఎన్నికలలో ఏమి జరుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: