కేరళాలో ఈ దుస్థితికి మానవ తప్పిదమే కారణమా?

Edari Rama Krishna
కేరళ జలదిగ్భంధంలో చిక్కుకుంది. ఎడతెరపి లేని వర్షం..  ఉప్పెనలా వస్తున్న వరదతో కేరళ కకావికలమైంది. వందలాది మంది జలసమాధి అయ్యారు. వేలకోట్ల రూపాయల ఆస్థినష్టం సంభవించింది. గత శతాబ్ధకాలంగా ఎన్నడూ లేని విధంగా కేరళలో వచ్చిన ఈ విపత్తు యావత్ ప్రపంచాన్నే కదిలిస్తోంది..కన్నీరు పెట్టిస్తోంది.    వరుణుడి ప్రకోపానికి విలవిల్లాడుతోన్న కేరళ రాష్ట్రానికి చేతనైనంత సాయం చేసేందుకు వివిధ రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. సగటు పౌరుల నుంచి ప్రముఖుల వరకూ తమ వంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు.

తెలంగాణ పాతికకోట్లు, ఆంధ్రా, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్, బీహార్, హర్యానా రాష్ట్రాలు తలా 10 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వం పదికోట్ల సాయంతో పాటు విపత్తు నిర్వహణ దళాన్ని కూడా కేరళకు పంపింది. ఒడిషా, తమిళనాడు రాష్ట్రాలు తలా ఐదేసి కోట్ల రూపాయలు ప్రకటించగా..  పుదుచ్చేరి రెండు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. మరోవైపు కేరళ వర్షాల తాకిడికి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మంది సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు.

అయితే ఇంతటి ప్రళయానికి కారణమేంటనే ప్రశ్నకు మాత్రం మానవ తప్పిదాలేనన్న జవాబు వస్తోంది.  వందేళ్లలో కనీవినీ ఎరుగనంత స్థాయిలో వర్షం కురిసిన మాట వాస్తవమే అయినా.. నదుల నిర్వహణలో లోపాలు, పర్యావరణ పరిరక్షణ పాటించకపోవడమే పరిస్థితి ఇంత తీవ్రరూపం దాల్చేందుకు కారణమైనట్లు స్పష్టమవుతోంది. 1924లో కేరళను వరదలు ముంచెత్తిన సమయంలో ఏకంగా 3,368 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసిన నేపథ్యంలో సుమారు వెయ్యింది మంది ప్రాణాలు కోల్పోగా వేల  మంది నిరాశ్రులైయ్యారు.  ఈ సంవత్సరం  జూన్‌ 1 నుంచి ఈ నెల 15 వరకు రాష్ట్రంలో 2,087.67 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇది ప్రమాద స్థాయి దాటిన విషయం అక్కడ ప్రభుత్వానికి, నిపుణులకు తెలిసిన విషయంమే. ఇదిలా ఉంటే కేరళాలో నదులపై పెద్ద ఎత్తున జలవిద్యుత్‌ కేంద్రాలను నిర్మించడంతో ఉదృతంగా వచ్చే వరుద నీరు కిందకు వెళ్లే పరిస్థితి లేకపోవడం ఈ ప్రమాదాలకు ప్రథమ కారణం అని చెప్పొచ్చు.  మొత్తంగా 14 జలవిద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఎక్కడా సరైన ప్రమాణాలు పాటించలేదని సమాచారం.

రాష్ట్రంలోని పల్లపు ప్రాంతాల్లో చాలా వరకు పర్యావరణ రహితంగా తయారయ్యాయని కేంద్రం 2010లో నియమించిన గాడ్గిల్‌ కమిటీ అప్పట్లోనే హెచ్చరించింది. అయినా కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. సరైన ప్రణాళికలు పాటించకుండా నదులపై వంతెనలు, బ్రిడ్జీలు కట్టితే..ఒక్కోసారి జరిగే విపత్తుకు ఖచ్చితంగా మానవ తప్పిదాలే అవుతాయని అంటున్నారు నిపుణులు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: