రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు... బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చి వైసీపీ తో కలిసి పోతుందా..!

Prathap Kaluva

రాష్ట్రం లో బీజేపీ కి మిత్రుడు దూరం అయిపోయాడు టీడీపి బీజేపీ నుంచి బయటికి వచ్చిన తరువాత బీజేపీ ఒంటరిది అయిపొయింది ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసి బతికి బట్ట కట్టలేదు కాబట్టి తనకు అర్జెంట్ గా మరో మిత్రుడు కావాలి అందుకే బీజేపీ జగన్ వైపు చూస్తున్నదని అర్ధం అవుతుంది. అయితే ప్రత్యేక హోదా ఇస్తేనే జగన్ బీజేపీ తో కలుస్తా అని చాలా సార్లు చెప్పినాడు. మరీ బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రం లో జగన్ తో కలిసి పార్టీ ని బతికిచ్చుకోవచ్చు అని చర్చలు మొదలైనాయి. 


రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు అంటూ ఎవరూ వుండరు. జగన్‌ని ప్రసన్నం చేసుకోవడానికి, బీజేపీ ప్రత్యేకహోదా ఇవ్వడానికి ఒప్పుకుంటుందా.? అంటే, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం అంత తేలికకాదు. 'మాతో కలిసి వున్నప్పుడు, ప్రత్యేకహోదాపై బీజేపీ అడ్డగోలుగా వ్యవహరించింది. కానీ, వైఎస్సార్సీపీతో కలిసి చెట్టాపట్టాలేసుకుని.. అప్పుడు ప్రత్యేకహోదా ఇవ్వాలనుకుంటోంది..' అంటూ గతంలోనే చంద్రబాబు 'చీకట్లో ఓ రాయి' విసిరేశారు. అది ఆయన ముందు జాగ్రత్త చర్య.


చర్చా కార్యక్రమాల్లో కావొచ్చు, బీజేపీ నేతలు మీడియా ముందుకొచ్చినప్పుడు కావొచ్చు, ఈ మధ్య వైఎస్సార్సీపీని బాగానే వెనకేసుకొస్తున్నారు. వైఎస్సార్సీపీ మాత్రం, బీజేపీని 'మిత్రపక్షంగా' భావించేందుకు ఒప్పుకోవడంలేదు. రానున్న రోజుల్లో 'ఆ గ్యాప్‌' కూడా తగ్గిపోతుందనే భావనతో కన్పిస్తున్నారు బీజేపీ నేతలు. అలా వారి ఆలోచన వర్కవుట్‌ అవ్వాలంటే, ప్రత్యేక హోదాకి బీజేపీ 'సై' అనాలి. ఒకవేళ అలా బీజేపీ, ప్రత్యేకహోదా విషయంలో మెట్టుదిగితే, ఆ ఘనత ఖచ్చితంగా వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: