కేరళ వరద బాధితులకు రొనాల్డో రూ.77 కోట్ల సాయం!

Edari Rama Krishna
కేరళ రాష్ట్రంపై వరుణుడు కోపోద్రిక్తుడయ్యాడు.  కేరళా వరదలు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపాలని కేరళ తల్లడిల్లుతోంది. భారీ వదలు కేరళను ముంచెత్తాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుని పోయాయి.   జాతీయ విపత్తు నివారణ సంస్థతో పాటుగా ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ దళాలు సహాయక కార్యక్రమాల్లో మునిగిపోయారు.  వివిధ రాష్ట్రాల నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు.  తాజాగా కేరళ వరదలకు పోర్చుగీసుకు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో చలించిపోయాడు.

తమ మంచి మనసు చాటుకుంటూ..ఏకంగా రూ.77 కోట్లను విరాళంగా ప్రకటించాడు.  ఇక భారీ వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైన నేపధ్యంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) పెద్ద మనసు చాటుకుంటూ 700 కోట్ల విరాళం ప్రకటించారు. యూఏఈ ప్రభుత్వం మరింత ముందుకొచ్చి కేరళకు సహాయనిధిని ప్రకటించిందని తెలిపారు.

సహాయక చర్యల నిమిత్తం రాష్ట్రానికి 100 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో దాదాపు రూ. 700కోట్లు) ఆర్థిక సాయం చేస్తామని యూఏఈ హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే..ఓ ఆటగాడు ఏకంగా రూ.77 కోట్లు ప్రకటించడంపై అందరూ హ్యాట్సాఫ్ చెబుతూ ప్రశంసలు కురిపించారు. అతడిని చూసి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న మన ఆటగాళ్లు నేర్చుకోవాల్సినది ఎంతో ఉందని, అతడిని చూసి నేర్చుకోండంటూ దుమ్మెత్తి పోశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: