చంద్ర బాబు మీద జగన్ 'పెళ్లి' వ్యాఖ్యలు బాగా గుచ్చు కున్నట్టున్నాయి..!

Prathap Kaluva

జగన్ తన పాద యాత్ర లో చంద్ర బాబు మీద విమర్శలు చేసిన సంగతీ తెలిసిందే. అయితే జగన్ పెళ్లి అనే కాన్సెప్ట్ తో విమర్శలు చేయడం తో రాజకీయాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. చెప్పాల్సిన విషయాన్ని జగన్ మరో కోణం లో చెప్పడం తో ఆసక్తి కరమైన చర్చ నడుస్తుంది. చంద్రబాబు - పెళ్ళిళ్ళు.. అంటే, రాజకీయంగా చంద్రబాబు పెట్టుకున్న పొత్తులు. ఒక్కటంటే ఒక్కపొత్తులో కూడా 'నైతికత' చూపకపోవడం చంద్రబాబు ప్రత్యేకత.


అవసరార్థం పెళ్ళి చేసుకోవడం తప్ప, సంసారం సజావుగా చేయడం చంద్రబాబుకి చేతకాదని రాజకీయంగానేనండోయ్‌ బీజేపీతో టీడీపీ తాజా పెళ్ళి - పెటాకుల వ్యవహారం చెప్పకనే చెబుతుంది. వామపక్షాలైతే టీడీపీతో ఒకప్పటి తమ వివాహం గురించి ఇప్పటికీ కుమిలిపోతున్నాయి. అంతేనా, చంద్రబాబుతో సంసారంపై ఓ పుస్తకాన్ని కూడా రాసేశాయి. తెలంగాణ రాష్ట్ర సమితి సంగతి సరే సరి. చంద్రబాబు - కేసీఆర్‌ రాజకీయ కాపురం గట్టిగా సంవత్సరం కూడా సాగలేదు.


సంవత్సరమేంటి.? ఎన్నికలకు ముందు పెళ్ళి జరిగితే, ఎన్నికల పోలింగ్‌ జరగ్గానే ఆ పెళ్ళి పెటాకులైపోయింది. బీజేపీతో టీడీపీకి రెండుసార్లు పెళ్ళయితే.. రెండుసార్లూ పెటాకులే. అంతిమంగా లాభపడేది చంద్రబాబే ఈ పెళ్ళిళ్ళతో. ఈ అంశాలన్నిటినీ వైఎస్‌ జగన్‌ ఫోకస్‌ చెయ్యాలనుకున్నారు.. జనానికి విడమర్చి చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: