జగన్ సీఎం అయితే మళ్లీ ప్రభుత్వ భవనాలు నిర్మించుకోవాలి..!

KSK
తాజాగా ఇటీవల ఆంధ్రరాష్ట్రంలో పడిన కుండపోత వర్షాలు రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో కట్టిన కట్టడాలను షేక్ చేసి పడేసాయి. కేవలం కొద్దిపాటి వర్షం సచివాలయంలో భారీగా కొన్ని కోట్లు ఖర్చుపెట్టి గట్టిన భవనాలను పెచ్చులు ఊడిపోయేలా చేసేశాయి. ఈ క్రమంలో సచివాలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి రాష్ట్రంలో కొద్దిపాటి వర్షం పడితే సచివాలయంలో బోటు వేసుకొని వెళ్లాల్సి వస్తుందని కామెంట్ చేశాడు.


దీనిబట్టి చంద్రబాబు కళల రాజధాని అమరావతి ఏ విధంగా తయారవుతుందో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క ఓ సెంటీ మీట‌ర్ వ‌ర్షం వ‌స్తేనే శ్లాబులు ఊడిపోవ‌డం ఏమిటి మ‌హాప్ర‌భో అని అంటున్నారు తాపీ మేస్త్రీలు...అంతంత కోట్లు ఖర్చుపెట్టి కడుతుంటే భవనాలలో పెచ్చులు ఊడిపోవడం దురదృష్టకరం అంటున్నారు.


ఈ క్రమంలో ఇదే విషయంపై మంత్రులను ప్రశ్నిద్దాం అని మీడియా వెళ్తుంటే సచివాలయం చుట్టుప్రక్కల ఎవరు మంత్రులు కనబడటంలేదు. అయితే మరోపక్క టిడిపి మద్దతు తెలిపే ఎల్లో మీడియాలు మాత్రం అప్పట్లో అమ‌రావ‌తి ప్ర‌పంచ రాజ‌ధాని అమెరికాలో కూడా ఇలాంటి నిర్మాణాలు జరగలేదని తెగ ఊదరగొటయి.


అయితే ప్రస్తుత సచివాలయంలో ఉన్న పరిస్థితిని గురించి మాత్రం తమ తమ చానల్లో వేటిని ప్రసారం చేయటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్ తెలిస్తే కచ్చితంగా తానే సొంతంగా మళ్లీ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకోవాలని అంటున్నారు కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: