చంద్రబాబు తెలివితక్కువ నిర్ణయానికి తొలిదెబ్బే "అయ్యన్నపాత్రుని స్పందన"

"తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటుంది" అనే చంద్రబాబు ఆలోచన నుండే టీడీపీ లోకి వలసలు కాంగ్రెస్ వారి వలసలు ఉదృతమౌతున్నాయి. ఈ  నేపథ్యం లో నర్సీపట్నం నియోజకవర్గానికి ప్రతినిధ్యం వహిస్తున్న మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచనల వ్యాఖ్యలు చేశారు. 

తొలినుండి అంటే నందమూరి తారక రామారావు నేతృత్వం లో రాజకీయ జీవితం ప్రారంభించిన తొలితరం టిడిపి వ్యక్తి కావటంతో ఆ పార్టీ మూలాల నుండే రాజకీయంగా ఇంతలా ఎదిగారు. ఈ సందర్భంగా ఆయన "కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే అంతకంటే పెద్ద తప్పు ఏమీ ఉండదని అన్నారు. 


అంతే కాదు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో పొత్తు లాంటి పెద్ద తప్పులు చెయ్యరని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఒక వేళ అలాంటి తప్పు చేస్తే అంత కంటే మించిన రాజకీయ ధారుణం ఉండదన్నారు.

రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీని తరిమికొట్టాలన్న ఏకైక ఉద్దేశంతో ఎన్టీఆర్ తెలుగగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. తెలుగు జనుల ఆత్మాభిమానం ప్రాధమ్యంగా జన్మించిన తెలుగుదేశం పార్టీ అలాంటి కాంగ్రెస్ తో అక్రమ పొత్తు అంటేనే పెద్ద దుర్మార్గం అన్నారు. టిడిపి-కాంగ్రెస్ తో పొత్తు ఆలోచనను తామే కాదు రాజకీయాలకు ఏమాత్రం సంభంధంలేని సాధారణ ప్రజలు కూడా క్షమించరని మంత్రి అయ్యన్నపాత్రుడు స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రికి దాదాపు హెచ్చరికే చేశారు.

అమరావతిలో ఏ నలుగురు కలసినా మాట్లాడే విషయం "చంద్రబాబు ఆలోచనను తెలివితక్కువ చర్యగాను, చంద్రబాబు తనకు రాజకీయంగా విధిలేని లేదా దిక్కులేని పరిస్థితుల్లో తీసుకున్న ఆత్మహత్యా సదృస నిర్ణయమే నని" అంటున్నారు. కాంగ్రెస్ తో పొత్తు అంటే బంగారు పళ్ళెం లో అధికారాన్ని పెట్టి వైసిపికి పదిలంగా అందించ టమే నని కూడా చలోక్తులు విసురుతున్నారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో అయ్యన్నపాత్రుని మాటే "వేదమంత్రం" తో సమానమేనని చెప్పవచ్చు. అంతేకాదు ఆ అలోచన తోనే రాష్ట్రంలో కాంగ్రెస్ నుండి టిడిపిలోకి వలసలు ప్రారంభమై అసులు పొత్తుకు కాంగ్రెస్ మిగలక పోగా....అపకీర్తి తెలుగుదేశానికి మాత్రం దక్కటం మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో మోడీని ఢీ కొట్టాలన్న ప్రతిపక్షాల ఐఖ్యతకు ఆది లోనే సంధి కొట్టవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. బాబూ! తస్మాత్ జాగ్రత్త.   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: