అత్త సొత్తు కాజేసిన అల్లుడు "కొత్త పార్టీ పెట్టగలరా?" బాబుకు లక్ష్మిపార్వతి సవాల్

తనకు తానే అనుభవఙ్జుడను, నిప్పును, చేతికి వాచి ఉంగరాలు లేని సామాన్యుణ్ణని చెపుతూ జనాల్ని తన మాయోపాయంతో గింగరాలు తిప్పే చంద్ర బాబుకు, ఆయన అత్తగారు దివంగత నందమూరి తారకరామారావు సతీమణి శ్రీమతి నందమూరి లక్ష్మిపార్వతి, గుండెపోటు తెప్పించేంత బలమైన సవాల్ విసిరారు. 



కాంగ్రెస్ వ్యతిరెఖత, తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ, ఆపై ఆత్మాభిమాన సంరక్షణ పేరుతో తెలుగుదేశం పార్టీ పుట్టాక నందమూరి తారకరామారావు నేతృత్వంలో తొలి సారి ఒంటరిగానె ఘన విజయం సాధించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చింది. ఆ తరవాత రెండవసారి ప్రత్యెక పరిస్థితుల్లో అనేక పార్టీల సౌహార్ధ్రతతతో కాంగ్రెస్ చేసిన మోసాన్ని తట్టుకొని నిలబడగలిగింది.  నాడు బిజెపి సహాయంతోనే ఆగష్ట్ ఉపద్రవాన్ని ఎదుర్కొని  కాంగ్రెస్ పీచమణచి విజయం సాధించింది.  ఇప్పుడు సిగ్గు లేకుండా ఆ కాంగ్రెస్ తోనే అక్రమసంభందం పెట్టుకోవటానికి చంద్రబాబు ఆయన పరోక్ష నేత్రుత్వ మీడియా కాంగ్రెస్ ఉత్తమోత్తమమని, నైతికత పూర్తిగా వదిలేసి, కలం మడమ తిప్పి కథనాలు రాయటానికి  రాయించటానికి,  నిశ్శిగ్గుగా, నగ్నంగా తన నిజస్వరూపాన్ని నడివీధిలో జనావళికి చూపించటానికి సిద్దమై కథనాలు ఒకపక్క ప్రసారాలు ఒకప్రక్క చేయటానికి సిద్ధమైంది. ఇదీ చంద్రబాబు ఆయన మద్దతు మీడియా నైతికత వాచీ ఉంగరాలు లేని నిజాయతీ. 
  
ఆ తరవాత ఎప్పుడూ పొత్తులేకుండా, పొత్తుపెట్టుకున్న పార్టీలను రాజకీయంగా దెబ్బతీస్తూ ఇంతకాలం ఓడుతూ గెలుస్తూ వచ్చింది. చివరకు ప్రస్తుత శాసనసభాకాలంలో కూడా సభాపతితో కుమ్మక్కై ప్రతిపక్షపార్టీ ఎమెల్యేలను నయాన్నో భయాన్నో ప్రయోజనాలు ఏరవేసి కప్పదాట్లువేయించి తనపార్టీలోకి గోడదూకించి అధికారాన్ని పటిష్టం చేసుకొని టిడిపికి జవజీవాలు అందించి అధికారం నిలబెట్టుకున్నారు చంద్రబాబు. ఈ సారి విజయంలో టిడిపికి మోడీ ప్రభంజనం పవన్ కళ్యాణ్ మైత్రి లేకుంటే వైసిపి అధికారంలోకి వచ్చి ఉండేదనేది గణాంకాలు చెప్పే నిజం. 

అందుకే తెలుగుదేశం పార్టీపై ఎప్పుడు విశ్లేషణలు చర్చలు జరిగినా, చంద్రబాబును వేలెత్తి చూపించే పరిస్థితి ఉంటుంది. రానున్న 2019 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు అధినేత దివంగత ఎన్టీఆర్ సతీమణి, వైసిపి నేత నందమూరి లక్ష్మీ పార్వతి టిడిపిపై చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ కేసీఆర్, వైసిపి జగనమోహనరెడ్డిలు ఇద్దరు తమకు తాముగా సొంతంగా పార్టీని పెట్టి, ఈ రోజున ఆ పార్టీలను ఇంత ఉన్నతస్థాయికి తీసుకొచ్చా రని, మరి అలానే చంద్రబాబు టీడీపీని వదిలిపెట్టి, కొత్త పార్టీని పెట్టి ఈ స్థాయికి తేగలరా? అన్న సూటి ప్రశ్నాస్త్రాన్ని సంధిస్తున్నారు. చంద్రబాబుకు దమ్ముంటే, టీడీపీని వదిలిపెట్టి, పార్టీ పగ్గాల్ని నందమూరి తనయులు బాలకృష్ణకో, జూనియర్ ఎన్టీఆర్ కో అప్పగించాలని, ఆపై చంద్రబాబు తన సొంత పార్టీని ఏర్పాటు చేసి ఈ స్థాయికి తేగలరా? అని ప్రశ్నించారు.

లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో ఆసక్తికర రసవత్తరచర్చ జరుగుతోంది. టీడీపీని, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నాడు దివంగత అధినేత ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. మరి అలాంటి పార్టీని హైజాక్ చేసి వెన్నుపోటుతో చేజిక్కించుకున్న చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన రావటమే పెద్ద తప్పుగా చెబుతున్నారు. టీడీపీకి ఉన్న బలమైన పునాదుల కారణంగా పార్టీ నిలబడిందని, అంతేగాని ఇందులో రవ్వంత కూడా చంద్రబాబు చాతుర్యమూ, చాణక్యమూ, గొప్పతనం అనేవి ఏమీ లేవంటున్నారు.

వెన్నుపోటు రాజకీయాలతో ఎన్టీఆర్ ను గద్దెదించి అధికారాన్ని తన సొంతం చేసుకున్నారని, అలాంటి పార్టీ ఈ రోజున కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే నిర్ణయం తీసుకుంటే, ఎన్టీఆర్ ఆత్మ ఎక్కడున్నా ఘోషిస్తుందన్నారు. అందుకే, చంద్రబాబుకు  ధమ్ముంటే టీడీపీని వదిలేసి, పవన్ కళ్యాణ్ మాదిరిగా, సొంతంగా తన పార్టీని నిర్మించుకొని అధికారం కోసం పోరాడాలన్న పిలుపును ఇచ్చారు లక్ష్మీపార్వతి.

మొత్తానికి చంద్రబాబుకు దివంగత ఎన్టీఆర్ సతీమణి, అత్తగారైన లక్ష్మీపార్వతి చాలంజ్ తో టీడీపీ అధినేత ఇరుకున పడ్డట్టేనని చెప్పవచ్చు. మామగారు దివంగతు లవగాv ..... అత్తగారి ఇంటి సొత్తైన తెలుగుదేశం పార్టీని ఈ అల్లుడుగారు సొంతంచేసుకొని అందలాలు ఎక్కటం శోచనీయమే. 
 
ఐతే ఈ అక్రమ సంభందాన్ని అనైతికతను తెలుగువాళ్లు చివరికి కాంగ్రెస్ అభిమానులు కూడా సహించరని మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు కె ఈ కృష్ణ మూర్తి కూడా పరోక్షంగా కొంత ప్రత్యక్షంగా కొంత బహిరంగంగానే విమర్శించారు అంగీకరించారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: