టీడీపీ కాంగ్రెస్ మైత్రి జగన్ కు పండుగ లాంటిది...!

Prathap Kaluva

టీడీపీ మరియు కాంగ్రెస్ పొత్తు అనేది అనధికారంగా ఫిక్స్ అయిందని చెప్పవచ్చు. అయితే ఈ పొత్తు గురించి స్వంత టీడీపీ నేతలే ఓ రేంజ్ లో రగిలి పోతున్నారు. ఏకంగా బహిరంగంగానే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.  కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవ‌డం త‌ప్ప చంద్రబాబుకు మ‌రో గ‌త్యంత‌రంలేదు. పొత్తు ప‌ర్యవ‌సానాల‌పై బాబు మ‌ల్లగుల్లాలు ప‌డుతున్నారు. కాంగ్రెస్‌తో పొత్తే నిజ‌మైతే ప్రజ‌లు గుడ్డలూడ‌దీసి కొడ‌తార‌ని మంత్రి అయ్యన్నపాత్రుడు నిన్న ఘాటుగా స్పందించారు.


కాంగ్రెస్‌తో పొత్తును వ్యతిరేకించే మొద‌టి వ్యక్తిని తానే అని కూడా ఆయ‌న ప్రక‌టించారు. అలాగే కాంగ్రెస్‌ ద‌రిద్రం త‌మ‌కొద్దని మ‌రో సీనియ‌ర్ మంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే మెడ‌కు ఉరితాడు బిగించుకుంటాన‌ని కూడా ఆయ‌న గ‌తంలో హెచ్చరించిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్‌తో పొత్తుపై బాబు కేబినెట్ స‌భ్యులే తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ వైఖ‌రి ఆంధ్రా టీడీపీలో మ‌రింత పెరిగే అవ‌కాశం లేక‌పోలేదు.


సొంత పార్టీ ముఖ్యులే కాంగ్రెస్‌తో పొత్తును తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న ప‌రిస్థితుల్లో వైఎస్ జ‌గ‌న్‌తో పాటు పార్టీ శ్రేణులు సంయ‌మ‌నం పాటించ‌డం అవ‌స‌రం. ఎందుకంటే పొత్తుపై టీడీపీ విమ‌ర్శల‌కు ప్రాధాన్యం ఉంది. ఆ విమ‌ర్శల వ‌ల్ల టీడీపీకి న‌ష్టం జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌. బు నిర్ణయాల‌పై సొంత పార్టీ నిర‌స‌న గ‌ళాల‌ను జ‌గ‌న్ మీడియా విస్తృతంగా జ‌నంలోకి తీసుకెళితే చాలు. ప్రస్తుత పొత్తు వాతావ‌ర‌ణ నేప‌థ్యంలో బాబుపై సొంత పార్టీ నాయ‌కులు విమ‌ర్శలు చేసేందుకే జ‌గ‌న్, మిగిలిన వైసీపీ నేత‌లు చాన్స్ ఇవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: