"జాఫర్ ని ఇంత పెర్ఫెక్ట్ గా డీల్ చేసిన నాయకుడు లేడు" అందరూ ఇదే మాట

KSK
చీరాల - ప్రకాశం జిల్లా మాత్రమె కాకుండా దాదాపు సగం పైగా రాష్ట్రం ఎదురు చూసిన ముఖాముఖి ప్రోగ్రాం మొత్తం మీద టీవీ లో ఇవాళ దర్శనం ఇచ్చింది. జాఫర్ లాంటి రిపోర్టర్ vs ఆమంచి లాంటి నాయకుడు ఇంటర్వ్యూ అంటూ ఇక ఘాటు మసాలా గురించి చెప్పక్కరలేదు ఎవ్వరికీ. పైగా ప్రోమో కటింగ్ లలో తమ తెలివితేటలు వాడడం లో టీవీ 9 పెట్టింది పేరు.

అవసరం లేని హడావిడి తో ప్రోమోలు కట్ చేసారు అని మళ్ళీ రుజువైంది క్లియర్ గా. ఆసక్తికర విషయం ఏంటంటే జాఫర్ తో ఇంటర్వ్యూ ని చాలా స్పోర్టివ్ గా, తెలివిగా అన్నిటికీ మించి పాజిటివ్ గా డీల్ చేసారు ఆమంచి కృష్ణ మోహన్ అని పొలిటకల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆమంచి ఇంటర్వ్యూ అనగానే సొంత పార్టీ టీడీపీ వాళ్ళే ఎగబడి మరీ చూసిన పరిస్థితి కనపడింది.

ఎక్కడ జాఫర్ అడిగే ప్రశ్నలకి ఆమంచి సీరియస్ అవుతారో అని అందరూ ఊహించారు. కానీ చీరాల ఎమ్మెల్యే గా హుందాతనం తో ఆమంచి డీల్ చేసిన స్టైల్ మాత్రం అందరినీ కట్టి పడేసింది అనే చెప్పాలి. ఒక్కొక్క చోట ఇదిగో ఇక్కడ కాంట్రవర్సీ అవుతుంది, ఇదిగో ఇక్కడ అయ్యి తీరుతుంది అని ఊహించిన ప్రతీ చోటా కాంట్రవర్సీ లేదు సరికదా కాంప్లిమెంట్ లు రావడం గొప్ప విషయం. జనాల సమస్యల దగ్గర నుంచీ తన మీద వచ్చిన ఆరోపణలూ, అపవాదులు, తన అనుచరుల యొక్క వ్యవహారాల వరకూ తొణక్కుండా బెణక్కుండా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఆన్సర్ లు ఇచ్చారు ఆయన అని చీరాల జనాలే చెప్పుకుంటున్నారు.

"ఒక్కొక్కసారి తప్పని పరిస్థితిలో నిజం దాస్తాను ఏమో కానీ అబద్ధం ప్రాణం పోయినా చెప్పను" అంటూ ఆయన అక్కడక్కడా చెప్పిన మాట సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఆమంచిని రౌడీ అంటూ ప్రోమోలలో కట్ చేసిన సదరు టీవీ ఛానల్ రిపోర్టర్ జాఫర్ ఇంటర్వ్యూ లో రివర్స్ లో ఆమంచికి కాంప్లిమెంట్ లు ఇవ్వడం - షేక్ హ్యాండ్ సైతం ఇచ్చి కొన్ని విషయాల్లో ఆయనకి ఫిదా అవ్వడం సోషల్ మీడియా లో అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. జాఫర్ ఇంటర్వ్యూ లు ఎన్నో చూసాం కానీ ఈ రేంజ్ లో ఎక్కడా పాజిటివ్ ఫీల్ లేదు అనేది సీనియర్ పొలిటికల్ లీడర్స్ తో పాటు సామాన్య జనం కూడా అంటున్న మాట. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: