నటుడు సుమన్...పవన్ పొలిటికల్ కెరియర్ పై చేసిన వ్యాఖ్యలకు మండిపడుతున్న అభిమానులు..!

KSK
గతంలో తెలుగు సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన నటుడు సుమన్.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 సంవత్సరాలు కావస్తున్నా నేపథ్యంలో పలు చానళ్లు ఇటీవల ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుమన్ తన సినీ ప్రస్థానాన్ని గురించి అనేకమైన విషయాలను ఇంటర్వ్యూలో ప్రేక్షకులకు పంచుకున్నారు.


ఈ క్రమంలో రాజకీయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణిస్తార అన్న ప్రశ్న సుమన్ ని యాంకర్ అడిగినప్పుడు సుమన్ ఇచ్చిన సమాధానం..ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. ఈ ప్రశ్నకు సుమన్ ఏమన్నారంటే... సినిమా రంగంలో టాప్ పొజిషన్లో ఉండి..డబ్బులు కాదని రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ ని అభినందించవచ్చు.


ముఖ్యంగా పవన్ చేస్తున్న ప్రసంగాలు సామాన్యులను యువతను బాగా ప్రభావితం చేస్తున్నాయి. అంతేకాకుండా చాలా మంది యువత పవన్కళ్యాణ్ని ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటున్నారు. అయితే పవన్ రాజకీయాల్లో రాణిస్తార అంటే...జాతకం బాగుంటే పవన్   కూడా రాజకీయాల్లో రాణిస్తాడని సుమన్ కామెంట్ చేశాడు. తాను చిన్నప్పటి నుంచి జాతకాలను నమ్ముతానని పవన్ జాతక రీత్యా ఎలా ఉందో తెలియదని.. రాశులన్నీ బాగుంటే మాత్రం గొప్ప స్థానానికి వెళుతాడని అన్నాడు.


దీంతో సుమన్ పవన్ పై చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ఆడుకుంటున్నారు. నిజంగా జాతకాల మీద రాజకీయాలు ఆధారపడి ఉంటే రాజకీయ పార్టీలన్నీ మహర్జాతకులకే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తే సరిపోతుంది కదా అని విమర్శిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: